iDreamPost
android-app
ios-app

సామాన్యులకు గుడ్ న్యూస్..దిగివచ్చిన ఉల్లి ధర! ఇదే కారణం..!

Onion Rates Down: గత కొంతకాలం నుంచి ఉల్లిధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఉల్లి ధరల ఘాటుకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉల్లి ధర దిగి వచ్చింది.

Onion Rates Down: గత కొంతకాలం నుంచి ఉల్లిధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఉల్లి ధరల ఘాటుకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఉల్లి ధర దిగి వచ్చింది.

సామాన్యులకు గుడ్ న్యూస్..దిగివచ్చిన ఉల్లి ధర! ఇదే కారణం..!

గత కొంతకాలం నుంచి ఉల్లిధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఉల్లి ధరల ఘాటుకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం వివిధ మార్కెట్లలో కేజీ ఉల్లిగడ్డ రూ.60 నుంచి 80 మధ్య పలుకుతోంది. నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉండగా.. ప్రస్తుతం రెట్టింపు పెరిగాయి. రాష్ట్రాల వారిగా లభ్యత, డిమాండ్ ఆధారంగా వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ.80 వరకు పలుకుతోంది. ఇలా ఘాటెక్కిన ఉల్లి ధరకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆ ఒక్క నిర్ణయంతో ఉల్లిధరలు తక్కు ముఖం పట్టాయి. మరీ..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీకి ఉల్లిని విక్రయించాలని భావించింది. ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు చేపట్టంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉల్లి ధర  ఐదు రూపాయల మేర తగ్గింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారల మంత్రిత్వ శాఖ ఉల్లి సబ్సిడీపై కీలక అంశాలను ప్రకటించింది. సబ్సిడీ మీద ఉల్లి ధరను ఎక్కువ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీలో కిలో ఉల్లిని రూ.35కు విక్రయిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఉల్లిపాయలను సబ్సిడీకి  విక్రయించడం ప్రారంభించింది.

 ఇలా ప్రభుత్వం తీసుకున్న చొరవ.. ప్రధాన నగరాల్లో ఉల్లి ధర తగ్గు ముఖం పడుతోందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. ఢిల్లీలో కిలో ఉల్లి రిటైల్ ధర 60 నుంచి 50 రూపాయలకు తగ్గింది. అలానే ముంబై నగరంలో కిలో 61 రూపాయల నుంచి 56 రూపాయలకు తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా చెన్నైలో కూడా ఉల్లిధర తగ్గింది. ఇక్కడ రూ.65 నుంచి  రూ.58 లకు తగ్గింది. ప్రభుత్వ మొబైల్ వ్యాన్లు, ఎన్ సీసీఎఫ్, నాఫెడ్ అవుట్ లేట్ల ద్వారా కిలోకు 35 రూపాయల సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయించడం ప్రారంభించింది. ఢిల్లీ ముంబైల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు చెన్నై, కోల్ కతా, పాట్నా, రాంచి, భువనేశ్వర్, గౌహాతి తో సహా ఇతర ప్రధాన నగరాలకు విస్తరించింది. భవిష్యత్ లో హైదరాబాద్ లో సబ్సిడీ ఉల్లిని ప్రారంభిచనున్నారు. పెరుగుతున్న ఉల్లి ధరల దృష్ట్యా సబ్సిడీ పరిణామం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కామర్స్  ప్లాట్ ఫామ్స్, మదర్ డెరీస్  సఫాల్ స్టోర్ లను ఈ జాబితాలో చేర్చాడానికి భావిస్తుంది. అలానే ఉల్లి పంపిణి మార్గాలను  విస్తరించాలని నిర్ణయించింది. 4.7 లక్షల ఉల్లి బఫర్ స్టాక్ ఖరీఫ్ విత్తనం విస్తీర్ణం పెరడంతో రానున్న రోజుల్లో కూడా ఉల్లి ధరలు అదుపులోనే ఉంటాయని ప్రభుత్వం ఆశా భావం వ్యక్తం చేస్తుంది. మొత్తంగా ఇటీవల కాలంలో పెరిగిన ఉల్లి ధరలతో అల్లాడిపోతున్న జనాలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం భారీ ఊరటను కలిగించింది. మరీ..ఉల్లి విషయంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.