iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 1 నుండి కొత్త రూల్స్, ఈ సిమ్ కార్డ్‌లు బ్లాక్ లిస్ట్ చేయబడతాయి?

New Sim Card Rules: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. జియో, ఎయిర్‌టెల్, వోడాపోన్ యూజర్లకు షాక్ కలిగించే నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆ నెంబర్లు బ్లాక్ అయిపోగలవు జాగ్రత్త.

New Sim Card Rules: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు జారీ చేసింది. జియో, ఎయిర్‌టెల్, వోడాపోన్ యూజర్లకు షాక్ కలిగించే నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆ నెంబర్లు బ్లాక్ అయిపోగలవు జాగ్రత్త.

సెప్టెంబర్ 1 నుండి కొత్త రూల్స్, ఈ సిమ్ కార్డ్‌లు బ్లాక్ లిస్ట్ చేయబడతాయి?

నేటికాలంలో ప్రతి ఒక్కరు మొబైల్ ను వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో అనేక రకాల కాల్స్ వినియోగదారులను విసిగిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో స్పామ్ కాల్స్, మోసపూరిత ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నెట్‌వర్క్‌లకు సంబంధించి కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. అంతేకాక కొత్త నింబధనలను 2024 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వర్తిస్తాయి.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ట్రాయ్ సంస్థ తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం..కొన్ని తమ మొబైల్ నెంబర్ ద్వారా టెలిమార్కెటింగ్ చేసే వారు రిస్క్ లో పడినట్లే. అలా చేసే వారి నెంబర్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తోంది. ఎవరైనా తమ మొబైల్ నెంబర్ నుంచి టెలిమార్కెటింగ్ చేస్తే, వారి నంబర్ రెండేళ్లపాటు బ్లాక్ చేయబడుతుంది. అలానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ టెలికాం మంత్రిత్వ శాఖ టెలిమార్కెటర్లు కోసం కొత్త ఫోన్ నంబర్ సిరీస్‌ను రిలీజ్ చేసింది. ఆర్థిక మోసాలను నిరోధించేందుకు టెలికాం కమ్యూనికేషన్ శాఖ 160 అనే నెంబర్ తో కొత్త సిరీస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు బ్యాంకింగ్ రంగం, బీమా రంగం తమ ప్రమోషనల్ కాల్స్ , మెసేజ్‌లను చేసే వారికి అదే 160 నంబర్ మొబైల్ నంబర్ సిరీస్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల అమలు వస్తే సాధారణ కస్టమర్లు అవాంఛిత ఫోన్ కాల్స్ నుండి రిలీఫ్  పొందుతారు. కొత్త నిబంధనలకు సంబంధించి టెలికాం కంపెనీలకు ట్రాయ్ కీలక సూచనలను కూడా పంపింది.

New rules from September

కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత  అనవసమరమైన కాల్స్, మెసేజ్‌ల సమస్యకు పరిష్కారం వస్తుందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఇలాంటి కాల్స్, మెసేజ్‌లన్నింటిని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాంటి అపరిచత కాల్స్ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. టెలి కమ్యూనికేషన్ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత మూడు నెలల్లో ఈ విధంగా పది వేల మోసపూరిత సందేశాలు వినియోగదారులకు పంపబడ్డాయి. మొత్తంగా సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ విరుద్దంగా మీ ఫోన్ వినియోగిస్తే బ్లాక్ చేయబడుతుంది.