కరోనా మహమ్మారితో రెండేళ్లు అల్లాడిపోయిన పరిశ్రమకు చక్కని ఊరట కలిగించింది 2022. ఆ విజయాల తాలూకు జ్ఞాపకాలు ఏంటో చూద్దాం. ‘ఆర్ఆర్ఆర్’ 1200 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ వసూళ్లతో మన దేశంలోనే కాదు జపాన్ లాంటి కంట్రీస్ లోనూ సరికొత్త రికార్డులు సృష్టించి రాజమౌళి మాయాజాలాన్ని ఆస్కార్ మెట్ల వరకు తీసుకెళ్లింది. గెలుపు దక్కలేది లేనిది ఇంకో రెండు నెలల్లో తేలనుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. దుల్కర్ […]
గత నెల వచ్చిన మూడు బ్లాక్ బస్టర్లలో ముందుగా సీతారామం అమెజాన్ ప్రైమ్ లో ఆల్రెడీ వచ్చేసింది. కేవలం 35 రోజుల నిడివితో స్ట్రీమింగ్ చేసేయడంతో వ్యూస్ మిలియన్లలో వెల్లువలా వచ్చి పడ్డాయి. కౌంట్ ఎంతనేది సహజంగా ఓటిటిలు అంత ఈజీగా బయట పెట్టవు కానీ దుల్కర్ సల్మాన్ కెరీర్లోనే హయ్యెస్ట్ రెస్పాన్స్ వచ్చి ఉంటుందని డిజిటల్ వర్గాల అంచనా. ఇప్పుడు అందరి చూపు రాబోయే కార్తికేయ 2, బింబిసారల మీదే ఉంది. నిఖిల్ మూవీని దసరా […]
ప్రతి శుక్రవారం థియేటర్ సినిమాల కోసం ఎదురు చూసినట్టే ప్రత్యేకంగా ఓటిటి కంటెంట్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఒకటి రెండు కాదు లెక్కలేనన్ని యాప్స్ ఉండటంతో ఎవరి సౌకర్యానికి తగ్గట్టు వాళ్ళు తమ బడ్జెట్ లకు అనుగుణంగా ప్లాన్లు తీసుకుని మూవీస్, వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారం మాత్రం కొంత డల్ గా కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బింబిసారని ఈ 30న జీ5లో విడుదల […]
సరిగ్గా రెండు నెలల క్రితం టాలీవుడ్ లోనే కాదు దేశమంతా విపరీతమైన ఆందోళన. జనం థియేటర్లకు రావడం లేదు. కనీస ఓపెనింగ్స్ లేవు. పెద్ద స్టార్ హీరోల చిత్రాలే బొక్క బోర్లా పడి సాయంత్రం షోకి ఖాళీ సీట్లు దర్శనమిచ్చే దారుణమైన పరిస్థితి. దెబ్బకు నిర్మాతలంతా షూటింగులు ఆపేసి మరీ తమ సమస్యల గురించి రోజుల తరబడి చర్చించుకుని పరిష్కారాలు రాసుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం వీటితో సంబంధం లేకుండా మంచి సినిమాలను కంటెంట్ ఉన్న వాటిని […]
టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా ఈ ఏడాది అత్యుత్తుమ నెలగా ఆగస్ట్ నెలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చిన గోల్డెన్ మంత్ ఇది. అవి కూడా స్టార్ హీరోలు లేకుండా. కార్తికేయ 2 ఇప్పటికే రెట్టింపు లాభాలు ఇచ్చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుండగా సీతారామం సైతం నేనేం తీసిపోలేదని బయ్యర్లను కనకవర్షంలో ముంచెత్తింది. ఇక బింబిసార మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వసూళ్లన్నీ డిస్ట్రిబ్యూటర్లకు […]
సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ రన్ రాలేని పరిస్థితుల్లో థియేటర్ కు వెళ్లలేని ఆడియన్స్ ఓటిటి కోసం ఎదురు చూడటం సహజం. అందులోనూ ఇటీవలే టాలీవుడ్ సక్సెస్ రేట్ విపరీతంగా పెరగడంతో వాటిని ఎప్పుడెప్పుడు స్మార్ట్ స్క్రీన్ మీద చూద్దామాని ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది. ఓసారి ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం.దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించిన అందమైన దృశ్య కావ్యం ”సీతారామం’ […]
కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసార ఆశించిన దానికన్నా జెట్ స్పీడ్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా అతని కెరీర్ బెస్ట్ గా కొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు పెడుతోంది. సీతారామం సైతం పాజిటివ్ టాక్ తో పోటీ ఇస్తున్నప్పటికీ మాస్ ఆడియన్స్ పరంగా సపోర్ట్ బింబిసారకే ఎక్కువగా ఉంది. అందులోనూ పిల్లలను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా దట్టించడంతో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు వచ్చేసింది. కేవలం […]
ఎల్లుండి విడుదల కాబోతున్న బింబిసార, సీతారామంల మీద ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. గత వారం రామారావు ఆన్ డ్యూటీ తీవ్రంగా నిరాశపరచడమే కాదు భారీ నష్టాలు మిగల్చడంతో ఇప్పుడు ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. వందల కోట్ల వేల్యూ ఉన్న స్టార్ హీరోలు కాకపోయినా డిఫరెంట్ గా అనిపిస్తున్న కంటెంట్ ఆడియన్స్ ని ఆకరిస్తోంది. రెండూ పీరియాడిక్ డ్రామాలను ఆధారంగా చేసుకున్న కథలే అయినప్పటికీ బింబిసారలో ఫాంటసీ మిక్స్ ఉండటం మాస్ ని ఎక్కువగా ఆకట్టుకునేలా […]
జూలై తీవ్రంగా నిరాశపరిచిన నేపథ్యంలో ఈ శుక్రవారం ఆగస్ట్ 5 మీద మంచి అంచనాలున్నాయి. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా రెండు డిఫరెంట్ జానర్ మూవీస్ వస్తుండటం, వాటికి కనక మంచి టాక్ వస్తే థియేటర్లు కళకళలాడతాయనే నమ్మకం కనిపిస్తోంది. సీతా రామం కోసం దుల్కర్ సల్మాన్ ఇక్కడే పాగా వేసి రెస్టు లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ ప్రత్యక్షంగా కవర్ చేస్తున్నాడు. అంతే కాదు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా విశేషాలే పంచుకుంటున్నాడు. తోడుగా […]