iDreamPost
గత వారం రామారావు ఆన్ డ్యూటీ తీవ్రంగా నిరాశపరచడమే కాదు భారీ నష్టాలు మిగల్చడంతో ఇప్పుడు ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. వందల కోట్ల వేల్యూ ఉన్న స్టార్ హీరోలు కాకపోయినా డిఫరెంట్ గా అనిపిస్తున్న కంటెంట్ ఆడియన్స్ ని ఆకరిస్తోంది.
గత వారం రామారావు ఆన్ డ్యూటీ తీవ్రంగా నిరాశపరచడమే కాదు భారీ నష్టాలు మిగల్చడంతో ఇప్పుడు ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. వందల కోట్ల వేల్యూ ఉన్న స్టార్ హీరోలు కాకపోయినా డిఫరెంట్ గా అనిపిస్తున్న కంటెంట్ ఆడియన్స్ ని ఆకరిస్తోంది.
iDreamPost
ఎల్లుండి విడుదల కాబోతున్న బింబిసార, సీతారామంల మీద ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. గత వారం రామారావు ఆన్ డ్యూటీ తీవ్రంగా నిరాశపరచడమే కాదు భారీ నష్టాలు మిగల్చడంతో ఇప్పుడు ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. వందల కోట్ల వేల్యూ ఉన్న స్టార్ హీరోలు కాకపోయినా డిఫరెంట్ గా అనిపిస్తున్న కంటెంట్ ఆడియన్స్ ని ఆకరిస్తోంది. రెండూ పీరియాడిక్ డ్రామాలను ఆధారంగా చేసుకున్న కథలే అయినప్పటికీ బింబిసారలో ఫాంటసీ మిక్స్ ఉండటం మాస్ ని ఎక్కువగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఉదయం 7 లోపలే కొన్ని చోట్ల స్పెషల్ షోలు వేయబోతున్నారు. దీన్ని బట్టి టీమ్ లో గట్టి కాన్ఫిడెన్సే కనిపిస్తోంది మరి.
ఇక బిజినెస్ విషయానికి వస్తే బింబిసార వరల్డ్ వైడ్ థియేట్రికల హక్కులను సుమారు 15 కోట్ల 60 లక్షల దాకా చేశారు. నైజాం 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఆంధ్ర 6 కోట్ల 50 లక్షలు, రెస్ట్ అఫ్ ఇండియా 1 కోటి 10 లక్షలు, ఓవర్సీస్ 1 కోటికి చేశారని సమాచారం. ఇది చాలా డీసెంట్ మొత్తం. బాగుందని టాక్ వస్తే చాలు ఈజీగా లాభాల్లోకి వెళ్లిపోవచ్చు. కళ్యాణ్ రామ్ నమ్మకం బలంగా కనిపిస్తోంది. ప్రమోషన్ ఇంటర్వ్యూలో అదే వ్యక్తం చేస్తున్నాడు. సీతారామం నుంచి పోటీ కనిపిస్తున్నప్పటికీ గ్రాండియర్ పరంగా బింబిసారకున్న అడ్వాంటేజ్ ప్లస్ అవ్వొచ్చు. మళ్ళీ వచ్చే వారం లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గంలు ఉన్నాయి కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టాలి.
ఇక సాఫ్ట్ మూవీగా ప్రమోట్ అవుతున్న సీతారామంని ఆశ్చర్యకరంగా 18 కోట్ల 70 లక్షలకు డీల్ చేశారట. ఇది పెద్ద మొత్తమే. బడ్జెట్ పరంగా ఎంత ఖర్చయినప్పటికీ దుల్కర్ సల్మాన్ కు ఇక్కడ సోలో హీరోగా బలమైన మార్కెట్ లేదు. రష్మిక మందన్న, మంచి పాటలు, మృణాల్ ఠాకూర్ గ్లామర్ లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నాయి కానీ మాస్ ని ఎంతమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి పోటీ అయితే ఆసక్తికరంగా ఉంది. రెండు కలిపి మొత్తం 35 కోట్ల దాకా బిజినెస్ చేసిన నేపథ్యంలో కలెక్షన్లు స్ట్రాంగ్ గా రావాలి. అసలే మౌత్ టాక్ తోనే మధ్యాహ్నం ఆటకు జాతకాలు బయటపడుతున్న ట్రెండ్ లో ఇవి ఎలాంటి సెన్సేషన్ చేస్తాయో చూడాలి.