iDreamPost
android-app
ios-app

తారక్ – కొరటాల కాంబినేషన్: ఎన్నో ప్రశ్నలు

తారక్ – కొరటాల కాంబినేషన్: ఎన్నో ప్రశ్నలు

ఆర్ఆర్ఆర్ విడుదలై నాలుగు నెలలవుతోంది. దాని ప్రమోషన్ల టైంలో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఎక్కడ పబ్లిక్ ఈవెంట్స్ లో దర్శనమివ్వలేదు. నిన్న అన్నయ్య కళ్యాణ్ రామ్ బింబిసార ప్రీ రిలీజ్ వేడుక కోసం అభిమానుల ముందుకు వచ్చాడు. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ ఆగస్ట్ 5 విడుదల కాబోతోంది. ఇప్పటికే పబ్లిసిటీ వేగం పెంచారు. హైప్ సరిపోవడం లేదనే ఉద్దేశంతో తమ్ముడు యంగ్ టైగర్ ని తీసుకొచ్చాడు కళ్యాణ్ రామ్. తన కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన బింబిసార మీద తనకు చాలా ఆశలున్నాయి. ఫాంటసీ జానర్ లో తీసిన ఈ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇదంతా బాగానే ఉంది కానీ అత్యధిక సంఖ్యలో నిన్న ఈవెంట్ కు వచ్చింది తారక్ ఫ్యాన్సే. ఆడిటోరియం మొత్తం కిక్కిరిసిపోయింది. దానికి తగ్గట్టే వాళ్ళను ఉత్సాహపరిచేలా జూనియర్ మాట్లాడారు. అయితే లుక్స్ పరంగా మరీ సన్నబడినట్టు కనిపించకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. కొరటాల శివతో చేయబోయే సినిమా త్వరలో ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంకా ఫిజికల్ ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టలేదనే చర్చ మొదలైంది. మరీ బొద్దుగా లేకపోయినా కొరటాల రాసుకున్న పవర్ ఫుల్ స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ కి ఇలా ఉంటే సరిపోదనే డిస్కషన్ జరుగుతోంది. స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు కాబట్టి వెయిట్ చేస్తున్నాడేమో.

ట్రిపులార్ ఎంత సక్సెస్ అయినా దాని క్రెడిట్ లో సగం రామ్ చరణ్ కు కూడా వెళ్ళింది కాబట్టి అరవింద సమేత వీర రాఘవ వచ్చిన మూడేళ్ళ తర్వాత తారక్ సోలో హీరోగా చేసే మూవీ కొరటాల తీయబోయేదే అవుతుంది. ఇంకా హీరోయిన్ సెలక్షన్ అవ్వలేదు. ఆచార్య తాలూకు పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి. ఆగస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మొదలుపెడితే 2023 సమ్మర్ లో రిలీజ్ చేయడం కష్టం. అలాంటిది ఇంతకన్నా లేట్ అయితే ఏ దసరాకో దీపావళికో షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. మరి జూనియర్ సన్నబడి, క్యారెక్టర్ రెడీ అయ్యి, కొరటాల శివ ఫైనల్ వెర్షన్ లాక్ చేసి, క్యాస్టింగ్ ని ఫిక్స్ చేసి ఇవన్నీ పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో మరి

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet