iDreamPost
android-app
ios-app

ఆగస్ట్ – 3 పువ్వులు 3 కాయలు

  • Published Aug 30, 2022 | 7:11 PM Updated Updated Aug 30, 2022 | 7:11 PM
ఆగస్ట్ – 3 పువ్వులు 3 కాయలు

టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా ఈ ఏడాది అత్యుత్తుమ నెలగా ఆగస్ట్ నెలనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు ఏకంగా మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చిన గోల్డెన్ మంత్ ఇది. అవి కూడా స్టార్ హీరోలు లేకుండా. కార్తికేయ 2 ఇప్పటికే రెట్టింపు లాభాలు ఇచ్చేసి ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుండగా సీతారామం సైతం నేనేం తీసిపోలేదని బయ్యర్లను కనకవర్షంలో ముంచెత్తింది. ఇక బింబిసార మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన వసూళ్లన్నీ డిస్ట్రిబ్యూటర్లకు ప్రాఫిట్సే. కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా వీటి దూకుడు మాత్రం రోజుల తరబడి సాగింది. ఒకవేళ వీటితో సమానంగా రంగ రంగ వైభవంగా, కోబ్రాలు టాక్ తెచ్చుకుంటే సరి లేదంటే మళ్ళీ పండగే.

అలా అని ఆగస్ట్ లో అన్నీ పళ్లే కాదు. కాయలు ఉన్నాయి. నితిన్ మాచర్ల నియోజకవర్గం దారుణంగా దెబ్బ తింది. కృతి శెట్టి గ్లామర్, రాను రాను రీమిక్స్, సముతిరఖని డ్యూయల్ రోల్ విలనీ ఇవేవి నాసిరకం కథా కథనాల ముందు పని చేయలేదు. దాంతో బ్రేక్ ఈవెన్ లో సగం కూడా అందుకోలేక ఆగిపోయింది. ఇక లైగర్ సంగతి సరేసరి. బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. ఎంతలేదన్నా యాభై కోట్లకు పైగా నష్టాలతో విజయ్ దేవరకొండకు చేదు అనుభవాన్ని మిగల్చనుంది. నాగ చైతన్య నటించిన కారణంగా తెలుగులోనూ మంచి బజ్ బిజినెస్ జరుపుకున్న అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కనీసం థియేటర్ అద్దెలు కూడా రాబట్టుకొలేదు.

ఎలా చూసుకున్నా ఈ నెల ఆశాజనకంగానే సాగింది. రేపు వచ్చే విక్రమ్ కోబ్రా మీద పెద్ద ఆశలేం లేవు కానీ ఒకవేళ ఆడితే మాత్రం అది ఈ లిస్టులో తోడవుతుంది. సెప్టెంబర్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. బ్రహ్మాస్త్ర లాంటి గ్రాండియర్లు నేను మీకు బాగా కావాల్సినవాడిని లాంటి చిన్న సినిమాలు పొన్నియన్ సెల్వన్ లాంటి విజువల్ మూవీస్ అన్నీ వస్తున్నాయి. మరి ఏవి ఏ స్థాయిలో ఆడతాయో చూడాలి. కాకపోతే ఆగస్ట్ తరహాలో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఇన్నేసి అయితే రావడం లేదు. పైన చెప్పిన వాటిలో రెండు డబ్బింగ్ వే ఉన్నాయి. ఇవన్నీ పక్కనపెడితే థియేటర్లకు వచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్న సందేశం ప్రేక్షకులు స్ఫష్టంగా ఇచ్చేశారు