iDreamPost
android-app
ios-app

లక్కీ హీరోయిన్.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టి సైలెంట్ అవ్వడానికి కారణం?

  • Author ajaykrishna Updated - 10:24 PM, Mon - 30 October 23

టాలీవుడ్ లో ఒక హిట్ పడితేనే దాదాపు నాలుగైదు సినిమాలు లైనప్ చేసి పెట్టుకుంటున్నారు హీరోయిన్స్. అలాంటిది వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టి.. లక్కీ హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటీ.. ఈ ఏడాది కొత్త సినిమాలేవి ఓకే చేయలేదట. మరి ఎందుకని సైలెంట్ అయ్యింది అనంటే.. రోయిన్ గా చేసిన మూడు సినిమాలు

టాలీవుడ్ లో ఒక హిట్ పడితేనే దాదాపు నాలుగైదు సినిమాలు లైనప్ చేసి పెట్టుకుంటున్నారు హీరోయిన్స్. అలాంటిది వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టి.. లక్కీ హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటీ.. ఈ ఏడాది కొత్త సినిమాలేవి ఓకే చేయలేదట. మరి ఎందుకని సైలెంట్ అయ్యింది అనంటే.. రోయిన్ గా చేసిన మూడు సినిమాలు

  • Author ajaykrishna Updated - 10:24 PM, Mon - 30 October 23
లక్కీ హీరోయిన్.. హ్యాట్రిక్ హిట్స్ కొట్టి సైలెంట్ అవ్వడానికి కారణం?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టడం అనేది గగనం అయిపోయింది. అందులోనూ డెబ్యూ హీరోయిన్స్ వరుసగా హిట్స్ కొట్టడమంటే.. ఖచ్చితంగా ఆ క్రెడిట్ ఆ హీరోయిన్స్ కే చెల్లుతుంది. ఎందుకంటే.. ఇండస్ట్రీలో ఎవరు ఎక్కువ కాలం కొనసాగాలంటే.. స్క్రిప్ట్ సెలక్షన్ అనేది తప్పనిసరి. హీరోయిన్స్ కెరీర్ ని డిసైడ్ చేసేది వాళ్ళ కథల ఎంపికనే. అవును.. స్క్రిప్ట్ విషయంలో ఎంత జాగ్రత్తపడితే అందుకు తగ్గట్టు ఫలితాలు వస్తాయి. అలా కెరీర్ ఆరంభంలో అనుకున్న డ్రీమ్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే.. అందరిలోను ఒకే రకమైన ఉత్సాహం, ఆసక్తి ఉండదు.. కనిపించదు. దానికి కారణం కూడా లేకపోలేదు.

సాధారణంగా హీరోయిన్స్ అయ్యాక ఇండస్ట్రీలోనే ఏళ్లపాటు పాతుకుపోవాలి.. స్టార్డమ్, స్టార్ స్టేటస్ లాంటివి ఎంజాయ్ చేయాలి అనుకునే రకం కొందరుంటారు. ఇంకొందరు అనుకోకుండా వస్తారు. అవకాశాలు వచ్చిన రోజులు ఉండి.. సడన్ గా మాయమైపోతారు. కానీ.. మోడలింగ్ నుండి వచ్చిన వాళ్ళు దాదాపు కొన్ని క్యారెక్టర్స్ ని మైండ్ లో పెట్టుకొని వచ్చి.. వాటికి అనుగుణంగా స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుంటారు. అలా టాలీవుడ్ లో అడుగు పెట్టిన బ్యూటీ సంయుక్త మీనన్. ఆల్రెడీ మలయాళంలో హీరోయిన్ అయినప్పటికీ.. భీమ్లానాయక్ లో పవన్ కళ్యాణ్ కి చెల్లిగా డెబ్యూ చేసింది. ఆ సినిమాలో క్యారెక్టర్ కి మంచి పేరే వచ్చింది.

ఆ తర్వాత సోలో హీరోయిన్ గా తెలుగులో బింబిసార.. పెద్ద హిట్. సెకండ్ మూవీ ధనుష్ సరసన సార్.. అదికూడా పెద్ద హిట్. ముచ్చటగా మూడో హిట్ విరూపాక్ష. సార్, విరూపాక్ష సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల గ్రాస్ వసూల్ చేశాయి. అలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న సంయుక్త.. తదుపరి సినిమాలు ఏవి ఓకే చేయలేదు. కళ్యాణ్ రామ్ తో డెవిల్ చేస్తుంది. అది ఎప్పుడో ఓకే చేసిన సినిమా. కానీ.. ఎందుకో మరి ఈ ఏడాది మాత్రం సంయుక్త కొత్తగా ఏ సబ్జెక్టు ఓకే చేయలేదని సమాచారం. ఎందుకో తెలియదు. బహుశా ఆమె అనుకుంటున్న సబ్జెక్టు రాలేదేమో లేదా కావాలని బ్రేక్ తీసుకుంటుందేమో అని నెటిజన్స్ అంటున్నారు. ఎందుకంటే.. ఒకటి రెండు హిట్స్ పడితేనే దాదాపు ఐదారు సినిమాలు లైనప్ చేసి పెట్టుకుంటున్న రోజులివి. అలాంటిది హ్యాట్రిక్ హిట్స్ కొట్టి.. సంయుక్త సైలెంట్ అవ్వడం ఏంటని చర్చలు జరుగుతున్నాయి. మరి దీనిపై సంయుక్త ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş