iDreamPost
iDreamPost
థియేట్రికల్ రిలీజులు గాడిన పడేందుకు ఇంకో రెండు వారాలు పట్టేలా ఉంది. బాక్సాఫీస్ ఇప్పటికే బాగా డల్ అయిపోయింది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ లు ఫైనల్ రన్ పూర్తి చేసుకుని ఆల్రెడీ ఓటిటిలోకి వచ్చేసాయి. బంగార్రాజు మెయిన్ సెంటర్స్ లో తప్ప మిగిలిన చోట్ల అద్భుతాలేమి చేయడం లేదు. ఎలాంటి ఆంక్షలు లేని నైజామ్ లోనే బాగా స్లో అయ్యింది. దీనికి తోడు ఇవాళ వచ్చిన కొత్త సినిమాలు కనీస బజ్ ని తేవడంలో ఫెయిలయ్యాయి. దీంతో ఇంకో వారం దాకా వేచి చూడక తప్పని పరిస్థితి. వచ్చే వారం కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి రావొచ్చని సమాచారం. జనవరి 26 లేదా 28లో ఒక డేట్ ని లాక్ చేసుకుని ఈ రోజు అనౌన్స్ మెంట్ ఇస్తారు.
ఇక ఫిబ్రవరి 4న రావాల్సిన ఆచార్య, సూర్య ఈటి రెండూ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కళ్యాణ్ రామ్ బింబిసార, రాజశేఖర్ శేఖర్ రావొచ్చని లేటెస్ట్ అప్ డేట్. బింబిసార షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. సరైన తేదీ ఎదురు చూస్తూ ఆలస్యం చేసుకుంది. ఇప్పుడు కరోనా సంగతి ఎలా ఉన్నా టాక్ బాగుంటే జనం ఏ సినిమాకైనా థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని టీమ్ డిసైడ్ అయ్యిందట. మల్లాది వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ ఎంటర్ టైనర్ లో కళ్యాణ్ రామ్ గెటప్, బాహుబలి రేంజ్ లో బిల్డప్ అంతోఇంతో అంచనాలు తెచ్చాయి. వాటిని నిలబెట్టుకుంటే చాలు.
ఇక భార్య జీవిత దర్శకత్వంలో రాజశేఖర్ చేసిన శేఖర్ కూడా 4నే టార్గెట్ చేసుకుంది. ఇది భారీ ఓపెనింగ్స్ లక్ష్యంగా పెట్టుకున్న సినిమా కాకపోవడంతో యాభై శాతం ఆక్యుపెన్సీతోనూ ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. మలయాళం హిట్ మూవీ జోసెఫ్ రీమేక్ గా రూపొందిన ఈ మెడికల్ థ్రిల్లర్ లో మంచి షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. పాటలు టీజర్లు నమ్మకాన్నైతే కలిగిస్తున్నాయి. చాలా సినిమాల విడుదల పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న డేట్లను ఇలా మీడియం రేంజ్ చిత్రాలు వాడుకోవడం చాలా అవసరం. లేదంటే అనవసరమైన క్లాష్ కు వెళ్లి దెబ్బ తినే పరిస్థితి రావొచ్చు. చూద్దాం ఏం జరగనుందో
Also Read : Rangasthalam : భారీ స్కెచ్చుతో పాత సినిమాకు పబ్లిసిటీ