iDreamPost
android-app
ios-app

ఈ ఇద్దరి మీదే అందరి చూపు

  • Published Aug 01, 2022 | 2:08 PM Updated Updated Dec 27, 2023 | 6:51 PM

సీతా రామం కోసం దుల్కర్ సల్మాన్ ఇక్కడే పాగా వేసి రెస్టు లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ ప్రత్యక్షంగా కవర్ చేస్తున్నాడు. అంతే కాదు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా విశేషాలే పంచుకుంటున్నాడు.

సీతా రామం కోసం దుల్కర్ సల్మాన్ ఇక్కడే పాగా వేసి రెస్టు లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ ప్రత్యక్షంగా కవర్ చేస్తున్నాడు. అంతే కాదు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా విశేషాలే పంచుకుంటున్నాడు.

ఈ ఇద్దరి మీదే అందరి చూపు

జూలై తీవ్రంగా నిరాశపరిచిన నేపథ్యంలో ఈ శుక్రవారం ఆగస్ట్ 5 మీద మంచి అంచనాలున్నాయి. పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా రెండు డిఫరెంట్ జానర్ మూవీస్ వస్తుండటం, వాటికి కనక మంచి టాక్ వస్తే థియేటర్లు కళకళలాడతాయనే నమ్మకం కనిపిస్తోంది. సీతా రామం కోసం దుల్కర్ సల్మాన్ ఇక్కడే పాగా వేసి రెస్టు లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలన్నీ ప్రత్యక్షంగా కవర్ చేస్తున్నాడు. అంతే కాదు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా విశేషాలే పంచుకుంటున్నాడు. తోడుగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు కీలక పాత్ర చేసిన సుమంత్ వీళ్ళ వెంటే ఉంటున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం ట్రైలర్ ఇప్పటికే బజ్ తెచ్చింది.

ఇక కళ్యాణ్ రామ్ తన మార్కెట్ కి మించిన బడ్జెట్ తో తీసిన బింబిసారని అదే రోజు తీసుకొస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా రావడం మంచి మైలేజ్ ఇచ్చింది. డైరెక్టర్ వశిష్టను నమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రమోషన్లు బలంగా చేస్తున్నారు. త్వరలో బాలకృష్ణ గెస్ట్ గా మరో వేడుక చేస్తారనే టాక్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఆ మధ్య వరస ఫ్లాపులతో మార్కెట్ డౌన్ చేసుకున్న కళ్యాణ్ రామ్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. సక్సెస్ అవుతుందనే నమ్మకంతో కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు సీక్వెల్స్ ని ప్రకటిస్తున్నారు. అందుకే తారక్ ఉండటం లేదు లెండి.
All eyes are on these two
గత నెల మొత్తం అయిదు డిజాస్టర్లు రావడంతో టాలీవుడ్ బాగా కుదేలయింది. విక్రమ్, మేజర్ ల తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. ఈ రెండూ డబ్బింగ్ చిత్రాలే. స్ట్రెయిట్ గా ఆడిన బ్లాక్ బస్టర్ ఏదంటే ఆర్ఆర్ఆర్ తర్వాత తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్ట్ 11 నుంచి విపరీతమైన పోటీ ఉండటంతో సీతారామం, బింబిసార మొదటి వారంలోనే వీలైనంత ఎక్కువ రాబట్టుకోవడం చాలా అవసరం. ఇండిపెండెన్స్ డేని లక్ష్యంగా పెట్టుకుని లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకర్వం, కార్తికేయ 2, స్వాతిముత్యంలు బరిలో దిగుతున్నాయి. మరి ఇంత తక్కువ టైంలో లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. చూడాలి ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు విజేతగా నిలుస్తారో.