iDreamPost
android-app
ios-app

అంజలితో ఉన్న ఈ హీరో.. ఇప్పుడు చిరంజీవిని మెప్పించిన దర్శకుడు! గుర్తుపట్టారా?

  • Published Aug 30, 2024 | 12:20 PM Updated Updated Aug 30, 2024 | 12:20 PM

ఈ ఫోటోలో అంజలితో ఉన్న నటుడ్ని గుర్తు పట్టారా..? ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ అందించి.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. నందమూరి, మెగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు. ఇంతకు ఆ హీరో ఎవరంటే..?

ఈ ఫోటోలో అంజలితో ఉన్న నటుడ్ని గుర్తు పట్టారా..? ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ అందించి.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. నందమూరి, మెగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు. ఇంతకు ఆ హీరో ఎవరంటే..?

  • Published Aug 30, 2024 | 12:20 PMUpdated Aug 30, 2024 | 12:20 PM
అంజలితో ఉన్న ఈ హీరో.. ఇప్పుడు చిరంజీవిని మెప్పించిన దర్శకుడు! గుర్తుపట్టారా?

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్. ఒకరు హీరోయిన్ అంజలి. మరొకరు తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్. ఒక్క మూవీ హిట్టుతో జాక్ పాట్ కొట్టేశాడు గురుడు. నందమూరి అండ్ మెగా ఫ్యామిలీని మెప్పించిన డైరెక్టర్. దర్శకుడు కాకముందు హీరో అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సన్నగా, నూనుగు మీసాలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో కాదు.. బింబిసారతో నందమూరి కళ్యాణ్ రామ్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన మల్లిడి వశిష్ట అలియాస్ వెంకట్. వశిష్ట పేరుతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కాకముందు ఓ మూవీలో హీరోగా కనిపించాడు. అదే ప్రేమ లేఖ రాశా. 2007లో విడుదలయ్యింది. ఇందులో మన తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్. ఈ వచ్చినట్లు, వెళ్లినట్లు కూడా చాలా మందికి తెలియదు.

వశిష్ట అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి. తొలి మూవీ ప్రేమ లేఖ రాశాలో వెంకట్ అనే పేరుతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. అంజలికి కూడా ఇదే తొలి సినిమా అయినప్పటికీ.. ఫోటో ముందు రిలీజ్ అయ్యింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రంలో శ్రీను, సంధ్య పాత్రల్లో అలరించారు వశిష్ట, అంజలి. నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు వశిష్ట..అసిస్టెంట్ డైరెక్టరుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ టాలెంట్.. నా ఆటోగ్రాఫ్, సఖియా, భగీరథ, బన్నీ, ఢీ, బాడీగార్డ్ వంటి చిత్రాలకు వర్క్ చేశాడు. ఈ మధ్యలోనే హీరోగా ఓ చిరు ప్రయత్నం చేశాడు. అది బెడిసి కొట్టడంతో యాక్టింగ్ కన్నా డైరెక్షనే బెటర్ అనుకుని ఇదే ఫీల్ట్‌లో కంటిన్యూ అవుతున్నాడు. హీరోగా మారిన 15 సంవత్సరాలతో బింబిసారతో డెబ్యూ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.

2022లో ఫాంటసీ యాక్షన్ మూవీగా వచ్చిన బింబిసార చిత్రం.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నందమూరి కళ్యాణ్ రామ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది. కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లు. ఈ చిత్రం హిట్ కొట్టడంతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు ఈ వశిష్టుడు. వెంటనే చిరంజీవికి కథ మెప్పించాడు. దీంతో విశ్వంభర సెట్స్ పైకి వెళ్లింది. రెండో మూవీతోనే మెగాస్టార్ చిరంజీవిని డీల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది కూడా ఫాంటసీ మూవీగా తెరకెక్కబోతుంది. యువీ క్రియేటన్స్ పతాకంపై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. త్రిష్ణ కృష్ణన్, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా వంటి ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి బాణీలు సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. ఇదిలా ఉంటే.. వశిష్టకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడు బేబి మూవీలో హీరోయిన్ వైష్ణవి చైతన్యను చేసుకునేది మగజాతి ఆణిముత్యంగా మారిపోయింది ఇతడే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet