సనాతన ధర్మంపై కోలీవుడ్ నటుడు, తమిళనాడులోని చెపాక్ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా, కరోనాను తరిమికొట్టినట్టుగానే.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హిందూ, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. బీజెపీ నేతలు సైతం ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. కాగా, తన కుమారుడు చేసిన వ్యాఖ్యలను […]
అయోధ్య రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కోట్లాది మంది కొలిచే శ్రీ రాముడి ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరిలో భవ్య రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రిలీజ్ చేసింది. అయోధ్య రామమందిరానికి సంబంధించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రామాలయం కోసం ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఒక […]
భార్యకు ముద్దుపెట్టిన భర్తను అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు.. అతడిని పక్కకు లాగి కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. భార్యకు ముద్దుపెడితే కొట్టడం ఏంటి ? అనే కదా మీ సందేహం. అతను తన భార్యకు నాలుగు గోడల మధ్య ముద్దుపెట్టలేదు. నలుగురూ చూస్తుండగా .. అది కూడా నదీస్నానం చేస్తుండగా ముద్దు పెట్టాడు. పవిత్రమైన నదీస్నానం చేసేటపుడు భార్యకు ముద్దుపెట్టడం అక్కడున్న వారిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటన అయోధ్యలో చోటుచేసుకుంది. […]
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలివ్వడం ఒక ఆధ్యాత్మిక ఉద్యమంలా సాగింది. తోచినంత మేర రామమందిర ట్రస్ట్ కు చాలామంది డొనేషన్స్ పంపించారు. ఒక దశలో వెండి ఇటుకలను దాచే ప్లేస్ లేదు, ఇక చాలునని ట్రస్ట్ అభ్యర్ధించింది. ఇక నిర్మాణానికి వచ్చిన చెక్కులను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, కొన్ని వేల చెక్కులు చెల్లలేదు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయని అంటోంది అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) […]
ఎంతోమంది హిందువుల కల అయోధ్య రామ మందిరం. రామ మందిరానికి సపోర్ట్ గా చారిత్రాత్మిక తీర్పు రావడం, 2020 ఆగస్టులో ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంపై భారతీయులంతా హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఆ ఆలయం పూర్తి అవుతుంది, ఎప్పుడెప్పుడు రాముల వారిని దర్శించుకుందాం అని కోట్ల మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిర నిర్మాణంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. తాజాగా ఆలయ గర్భగుడి నిర్మాణానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ […]