Swetha
అయోధ్యలో రాముని ఆలయం గురించి.. అక్కడికి నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల గురించి నిత్యం చెప్పుకుంటూనే ఉన్నాము. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం అక్కడ ఉండి డబ్బు సంపాదించే ఓ బాలుడి గురించి.. ఇతని రోజు జీతం తెలిస్తే నోటి మీద వేలు వేసుకోవాల్సిందే.
అయోధ్యలో రాముని ఆలయం గురించి.. అక్కడికి నిత్యం వచ్చే వేలాది మంది భక్తుల గురించి నిత్యం చెప్పుకుంటూనే ఉన్నాము. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం అక్కడ ఉండి డబ్బు సంపాదించే ఓ బాలుడి గురించి.. ఇతని రోజు జీతం తెలిస్తే నోటి మీద వేలు వేసుకోవాల్సిందే.
Swetha
అయోధ్యలో రాముని ఆలయం నిర్మించాలనే కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది. అనుకున్నట్లుగానే అక్కడ సవ్యంగా బాల రాముడికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిత్యం.. దూప దీప నైవేద్యాలతో.. వేలాది మంది భక్తుల రాకపోకలతో.. అయోధ్య కళకళలాడుతుంది. రామ్ లల్లా పేరుతో కొలువు తీరిన బాలరాముడి గురించి కూడా నిత్యం ఎన్నో వార్తలను వింటూనే ఉన్నాము. ఇంకా అయోధ్యకు చేరుకునేందుకు క్రమంగా ప్రభుత్వం అనేక రకాలా వెసులుబాటులను కల్పిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయోధ్య రాముడిని కనీసం ఒక్కసారైనా దర్శించి తీరాలని ఎంతో మంది భక్తులు కోరుకుంటూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. అసలు విషయం ఏంటంటే.. అక్కడికి వచ్చే భక్తుల సంగతి అలా ఉంచితే.. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి సంపాదన తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బాలుడి వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలుడు నిత్యం అయోధ్యకు వచ్చే భక్తులకు కుంకుమ, తిలకం పెడుతూ ఉంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ బాలుడు వారి నుదుటన.. తిలకం పెడుతూ సరదాగా సమయాన్ని గడిపేస్తూ ఉంటాడట. అయితే, అక్కడికి వచ్చిన భక్తులలో ఒకరు సరదాగా ఆ బాలుడిని రోజుకు ఎంత సంపాదిస్తావ్ అని అడుగగా.. ఆ బాలుడు రోజుకు పదిహేను వందల వరకు సంపాదిస్తానంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఒక్కోసారి ఇంకా ఎక్కువే సంపాదిస్తానని కూడా నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాడు ఆ బాలుడు. దీనితో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు మాములు వాళ్ళ కంటే ఇతనే ఎక్కువ సంపాదిస్తున్నదంటూ రకరకాల కామెంట్స్ తో ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఇక అయోధ్య రామ మందిర విషయానికొస్తే.. ఇప్పటికే అందరు అయోధ్యలో కొలువు తీరిన బాలరాముడిని చూసేందుకు బారులు తీరుతున్నారు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు అక్కడకు వెళ్తున్నారు. వారి వంతుగా బాల రాముని హుండీలను నింపేస్తున్నారు. లడ్డు, బూందీ, జిలేబీ ఇలా రకరకాల ప్రసాదాలను వారి వంతుగా బలరాముని సమర్పించి.. దానిని భక్తులకు పంచిపెడుతున్నారు. ఇక బాల రాముని దయ వలన అక్కడ వ్యాపారం చేసుకునే వారు కూడా బాగానే సంపాదిస్తున్నారు, ప్రస్తుతం అక్కడ అందరికి కుంకుమ, తిలకం దిద్దే బాలుడికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో కామెంట్స్, షేర్స్ తో వైరల్ అయిపోతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
View this post on Instagram
A post shared by Amit Singh || Guardians of the Cryptoverse (@guardians_of_the_cryptoverse)