iDreamPost
android-app
ios-app

అయోధ్య వెళ్లేవారికి అలెర్ట్.. ఆ సమయంలో రాముడి దర్శనాలు బంద్!

Ayodhya's Ram Temple: అయోధ్యలో కొలువైన బాలరాముడిని చూసేందుకు దేశ వ్యాప్తంగా జనం లక్షలాదిగా అయోధ్యకు తరలివెళ్తున్నారు. తాజాగా అయోధ్యకు వెళ్లే రామభక్తులకు ఆలయ అధికారులు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు.

Ayodhya's Ram Temple: అయోధ్యలో కొలువైన బాలరాముడిని చూసేందుకు దేశ వ్యాప్తంగా జనం లక్షలాదిగా అయోధ్యకు తరలివెళ్తున్నారు. తాజాగా అయోధ్యకు వెళ్లే రామభక్తులకు ఆలయ అధికారులు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు.

అయోధ్య వెళ్లేవారికి అలెర్ట్.. ఆ సమయంలో రాముడి దర్శనాలు బంద్!

కోట్లాది మంది హిందువులు ఎన్నో శతాబ్దాలు ఎదురు చూసిన అయోధ్య రామ మందిర కల నేరవేరింది. ఎన్నో పోరాటలు, ఎందరో కృషి ఫలితంగా కోట్లాది మంది హిందులు ప్రార్థనలతో ఈ కల సాకారం అయ్యింది. జనవరి 22న అయోధ్య నగరంలో రామయ్య కొలువు దీరారు. బాలక్ రామ్ ని ఈ మందిరంలో ప్రతిష్టించారు. ఇక అయోధ్య మందరి ప్రారంభోత్సవ జరిగిన మరుసటి రోజు నుంచి రామయ్య దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇక బాలక్ రామ్ ని  చూసేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రజలు అయోధ్యకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రామయ్య దర్శనం విషయంలో శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జనవరి 22వ తేదీన శ్రీరామ చంద్రుడు తన నివాసంలో కొలువుదీరారు. ఇక ఆయనను దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కోట్లాడి మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. ఇంకా భారీ స్థాయిలో వస్తూనే ఉన్నారు. ఫలితంగా అయోధ్య ఆలయంతో పాటు నగరం కూడా రామ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే వీలైనంత మంది ఎక్కువ భక్తులకు రోజూ రామయ్య దర్శనంకి ఇక్కడి ట్రస్ట్ అవకాశం కల్పించింది. ఎక్కువమంది భక్తులు అయోధ్యకు వస్తుండటంతో మొదట్లో నిర్ణయించిన దర్శన వేళలను ఆ తర్వాత పొడగించారు.

తాజాగా మరోసారి బాలక్ రామ్ దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. ఈ శుక్రవారం నుంచి అయోధ్యలో రామ మందిరాన్ని రోజూ మ‌ధ్యాహ్నం ఒక గంట పాటు మూసివేయ‌నున్నట్లు ప్రకటించారు. మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వ‌ర‌కు రామ్‌ల‌ల్లా ద‌ర్శనం ఉండ‌ద‌ని ఆల‌య పూజారి ఆచార్య స‌త్యేంద్ర దాస్ వెల్లడించారు. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు  పెద్ద సంఖ్యలో భ‌క్తులు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇప్పటి వ‌ర‌కు మ‌ధ్యాహ్నం వేళ మూసివేయ‌లేదని వెల్లడించారు. ఉద‌యం 6 గంటల నుంచి ప్రారంభం అవుతున్న అయోధ్య రాముడి దర్శనాలు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

తెల్లవారుజామున 4గంట‌ల‌కే  రామయ్యకు పూజ‌లు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు.. రెండు గంట‌లు విరామం తీసుకుంటున్నారు. అనంతరం ఉదయం 6 గంట‌ల నుంచి భక్తులను ద‌ర్శనంకు అనుమతిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విరామం లేకుండా దర్శనం ఇవ్వడం సరైంది కాదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించినట్లు ఆలయ పూజరి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వ‌ర‌కు రామ మందిరాన్ని మూసివేయాల‌ని నిర్ణయించినట్లు తెలిపారు. మరి.. అయోధ్య ట్రస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.