iDreamPost
android-app
ios-app

విషాదం.. అయోధ్యలోని సరయు నదిలో కొట్టుకుపోయిన తెలుగమ్మాయి!

  • Published Jul 30, 2024 | 3:50 PM Updated Updated Jul 30, 2024 | 3:50 PM

Ayodhya: దేశ వ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యల్లో భక్తులు తరలి వెళ్తున్నారు.

Ayodhya: దేశ వ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యల్లో భక్తులు తరలి వెళ్తున్నారు.

విషాదం.. అయోధ్యలోని సరయు నదిలో కొట్టుకుపోయిన తెలుగమ్మాయి!

ఉత్తర్ ప్రదేశ్‌లోని అయ్యోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మాణం జరిగింది. 2024 జనవరి 22న ప్రధాన మోదీ చేతుల మీదుగా రామ మందిరంలో బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ట జరిగింది. భారత దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రతి హిందువు ఆ ఆనంద క్షణాలు వీక్షించారు. ప్రతి రోజూ అయోద్యకు వేల సంఖ్యల్లో భక్తులు వెల్లి బాలరాముడిని దర్శించుకుంటున్నారు. రామ మందిరంతో పాటు అక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలు తిలకించి వస్తున్నారు. మనిషికి ప్రమాదాలు ఏ రూపంలో వెంటాడుతాయో తెలియదు. అయోద్యకు విహారానికి వెళ్లిన ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ యువతి సరయు నదిలో కొట్టుకునిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లాకు చెందిన తాళ్ళపల్లి నాగరాజు కుటుంబం జులై 28న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యకు వెళ్లారు. జులై 29న దైవ దర్శనం కోసం కుటుంబ సమేతంగా సరయు నదిలో స్నానాలు చేయడానికి వెళ్లారు. ఐదుగురు అమ్మాయిలు నదిలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారు. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉన్న వారు ఒక్కసారే గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.   వెంటనే స్థానికులు అప్రమత్తమైన నదిలో దూకి యువతులను కాపాడే ప్రయత్నం చేశారు.

స్నానం కోసం నదిలో దిగిన  నలుగురు అమ్మాయిలను కాపాడగలిగారు. వారితో వెళ్లిన తేజశ్రీ అనే అమ్మాయిని కనుగొనలేకపోయారు. నిన్నటి నుంచి రెస్క్యూ టీం తేజశ్రీ గురించి గాలిస్తూనే ఉంది. ప్రస్తుతం తేజశ్రీ జనగాం పట్టణంలో ఇంటర్మీడియట్ చదువుతుంది.తేజశ్రీ గల్లంతై 24 గంటలు కావొస్తున్న ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న ఉత్తర ప్రదేశ్ పోలీసులు తేజశ్రీని గాలిస్తున్నామని తెలిపారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కూతురు తేజక్ష ఎంతో చలాకీగా ఉంటుందని. స్నానానికి వెళ్లే సమయంలో కూడా జాగ్రత్తగా ఉంటానని చెప్పి వెళ్లి ఇప్పుడు కనిపించకుండా పోయిందని వాపోయారు.