iDreamPost

అయోధ్య రామ్​లల్లాకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి కన్నుమూత!

  • Published Jun 22, 2024 | 7:18 PMUpdated Jun 22, 2024 | 7:18 PM

అయోధ్యలో రామ్​లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి కన్నుమూశారు. ఆయన మృతిపై భక్తులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

అయోధ్యలో రామ్​లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి కన్నుమూశారు. ఆయన మృతిపై భక్తులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

  • Published Jun 22, 2024 | 7:18 PMUpdated Jun 22, 2024 | 7:18 PM
అయోధ్య రామ్​లల్లాకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రధాన పూజారి కన్నుమూత!

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అప్పట్లో దేశం మొత్తాన్ని ఏకం చేసింది. ఎన్నో వందల ఏళ్ల కల నెరవేరడంతో ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. ప్రాణప్రతిష్ట జరిగిన నాడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు భక్తులు తమ ఇళ్లలోనే పూజలు చేసుకున్నారు. అవకాశం దొరికిన వాళ్లు అయోధ్యకు వెళ్లి బాలరాముడి ప్రాణప్రతిష్టను కళ్లారా తిలకించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆ వేడుకల సమయంలో అర్చక బృందం సేవల్ని అందరూ ప్రశంసించారు. ముఖ్యంగా రామ్​లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ పనితీరును అంతా మెచ్చుకున్నారు. అయితే ఆయన తాజాగా కన్నుమూశారు.

96 ఏళ్ల లక్ష్మీకాంత్ దీక్షిత్.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాశీలో బాగా పేరొందిన పండితుల్లో ఒకరిగా లక్ష్మీకాంత్​ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. ఆయన ఫ్యామిలీ తరతరాలుగా కాశీలోనే ఉంటోంది. అక్కడి మణికర్ణిక ఘాట్​లో అంత్యక్రియలు జరగనున్నాయి. లక్ష్మీకాంత్ దీక్షిత్ మృతి మీద ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని గొప్ప పండితుల్లో ఒకరిగా ఆయన్ను మోడీ ప్రశంసించారు. కాశీ విశ్వనాథ్ ధామ్​తోపాటు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల జ్ఞాపకాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. సంస్కృత భాష, భారతీయ సంస్కృతికి లక్ష్మీకాంత్ చేసిన సేవలు అపురూపమని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి