iDreamPost
android-app
ios-app

అయోధ్యలోని కోతుల ఆహారం కోసం.. స్టార్ హీరో కోటి విరాళం!

  • Published Oct 30, 2024 | 2:18 PM Updated Updated Oct 30, 2024 | 2:18 PM

Akshay Kumar: అయోధ్య రామమందిరం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నెలకొనిఉన్న హిందూ దేవాలయం. రామ మందిరంలో బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో కోతుల కోసం స్టార్ హీరో భారీ విరాళం ప్రకటించారు.

Akshay Kumar: అయోధ్య రామమందిరం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నెలకొనిఉన్న హిందూ దేవాలయం. రామ మందిరంలో బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో కోతుల కోసం స్టార్ హీరో భారీ విరాళం ప్రకటించారు.

అయోధ్యలోని కోతుల ఆహారం కోసం.. స్టార్ హీరో కోటి విరాళం!

అయోధ్య రామమందిరం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం. అయోధ్యలో దివ్య రామ మందిర నిర్మాణం జరిగి..2024 జనవరి 22న, బాల రాముడు (రామ్ లల్లా) ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఒక చారిత్ర‌క ఘ‌ట‌న అంటూ ప్రజలు చెప్పుకున్నారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇటీవల దక్షిణాది చిత్రాల్లో సైతం నటిస్తున్నారు. తాజాగా అక్షయ్ కుమార్ గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. దీపావళికి ముందు శ్రీరాముని భూమి అయిన అయోధ్యలో కోతుల ఆహారం కోసం కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు. పూర్తి వివరాల్లోకి వెలితే..

అయోధ్య నగరంలో వానరాల పోషణ నిమిత్తం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘ఆంజనేయ సేవా ట్రస్ట్’ వారికి ఈ విరాళం అందజేయనున్నట్లు అక్షయ్ కుమార్ తెలిపారు. తాను చేస్తున్న ఈ సేవ దీపావళి సందర్భంగా దివంగతులైన తన తల్లిదండ్రులు హరి ఓం, అరుణా భాటియా, తన మామ బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. అయెధ్య రామాలయానికి వచ్చే భక్తులను వానరాలు ఇబ్బంది పెట్టకుండా.. వాటికి ఆకలి తీర్చడానికి ఈ మొత్తం ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీడింగ్ వ్యాన్ కూడా ఆయన పంపించారు. అక్షయ్ కుమార్ వానరాలకు ఆహారం పెట్టడం కొత్తేం కాదు. బాలరాముడి ఆలయం ప్రారంభం అయినప్పటి నుంచి అయోద్య శివారులో దాదాపు 1200 కోతులకు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నాడు. తాజాగా వానరాల ఆహారం కోసం ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించడంపై ‘ఆంజనేయ సేవా ట్రస్ట్’ ఫౌండేషన్ ప్రియా గుప్త హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రియాగుప్తా మాట్లాడుతూ.. ‘అక్షయ్ కుమార్ ఎంతో గొప్ప ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. తన సిబ్బంది లేదా తనతో కలిసి పనిచేసే సహ నటులు ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుంటాడు. కోతులకు ఇంత పెద్ద విరాళం ఇచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని’ అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘అయోధ్యలో ఆహారం కోసం కోతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిసినపుడు చాలా బాధ వేసింది. తనవంతు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. వాటికి సకాలంలో పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నాను’ అని అన్నారు. కోతులు అత్యంత పవిత్రమైన జీవులు అని చెబుతారు. హిందువులు హనుమంతుడిగా భావించి పూజిస్తుంటారు. అయితే కొంత కాలంగా వీటి సంతతి విపరీతంగా పెరిగిపోవడంతో పట్టణాల్లో మనుగడ కష్టంగా మారింది. అడవుల నుంచి గ్రామాలు, పట్టణాల్లోకి వస్తున్నాయి. కోతుల జీవన పరిస్థితి మెరుగు పర్చడం కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

జగత్గురు స్వామి రాఘవాచార్య జి మహరాజ్ మార్గదర్శకత్వంలో ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అక్షయ్ తెలిపారు. గతంలో కరోనా సమయంలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా సేవలందించిన బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్ (BMC) కార్మికులకు అండగా నిలిచారు. వారికి మూడు కోట్ల రూపాయలు విరాళంగా అందజేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గత‌కొంత కాలంగా వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు అక్షయ్ కుమార్. ఈ మధ్యనే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సర్ఫిరా, ఖేల్ ఖేల్ మే మూవీస్ కూడా అభిమానులను నిరాశపరిచాయి. ఇప్పడు అక్షయ్ ఆశలన్నీ సింగం ఎగైన్, కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ‘హౌస్‌ఫుల్ 5’ మీదే ఉన్నాయి. ఈ మూవీ 6 జూన్ 2025న విడుదల కానుంది.