iDreamPost
android-app
ios-app

అయోధ్య రామ మందిరంలో పైకప్పు నుంచి నీరు లీక్ !

Ayodhya RamTemple Roof Leak: ఎంతో  ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు లీకేజీ అవుతున్నాయి. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కుండపోతగా వాన కురింసింది. ఇక ఈ అంశంపై ఆలయ ప్రధాన అర్చకులు కీలక విషయాలు తెలిపారు.

Ayodhya RamTemple Roof Leak: ఎంతో  ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు లీకేజీ అవుతున్నాయి. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కుండపోతగా వాన కురింసింది. ఇక ఈ అంశంపై ఆలయ ప్రధాన అర్చకులు కీలక విషయాలు తెలిపారు.

అయోధ్య రామ మందిరంలో పైకప్పు నుంచి నీరు లీక్ !

హిందువులు కొన్ని వందల సంవత్సరాలుగా ఎదురు చూసిన  అయోధ్య రామందిర నిర్మాణం జరిగింది. జనవరి 22వ తేదీన రామ మందిరం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రారంభించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు సంతోషంలో మునిగితేలారు. ఏళ్ల పాటు సాగిన నిరీక్షణకు తెరపడుతూ..అయోధ్య మందిరంలో  రామయ్య కొలువు తీరాడు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణం చేపట్టింది.  ఎంతో మంది ఇంజనీర్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ఆలయం పైకప్పులో నీరు లీకేజ్ అవుతుంది. ఈ ఘటనపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎంతో  ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు లీకేజీ అవుతున్నాయి. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కుండపోతగా వాన కురింసింది. ఇలా పడిన కుండపోత వర్షం కారణంగా నీరు రామ మందిరం పైకప్పు నుంచి  నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ సోమవారం తెలిపారు. రామ్‌లల్లా ముందు పూజారి కూర్చునే ప్రదేశంలో, అలానే వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్‌ అవుతున్నట్టు గుర్తించామని ఆయన  వెల్లడించారు. ఇలాగే భారీగా వానలు కురుస్తుంటే గర్భగుడిలో కూర్చుని లోపల పూజ చేయడం కూడ కష్టమేనని పూజరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది ఇంజనీర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భ గుడి పైకప్పు నుండి నీరు కారడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు.

అయోధ్య రామ మందిరం నిర్మించిన తరువాత వచ్చిన వానకాలం సీజన్ లోని తొలి వర్షానికే గర్భగుడిలో నీరు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట నీరు లీకవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడం, ప్రధాన పూజారి గుడికి వెళ్లే పదమూడు రోడ్లూ జలదిగ్బంధంలోనే ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాక ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి చేరిన మురుగునీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి స్పందించారు.

నేటి ఉదయం నుంచి నష్ట నియంత్రణను చర్యలు ప్రారంభించానమని, ఇళ్ల నుండి నీటిని తొలగించడానికి మునిసిపల్ బృందాలను రంగంలోకి దింపామని తెలిపారు. ఇక గర్బగుడిలో నీరు లీకేజీ కావడంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రామ మందిర నిర్మాణంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం హడావుడిగా రెండో శ్రేణి నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా బీజేపీ అయోధ్యను అవినీతి కేంద్రంగా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు. అయితే వీరి విమర్శలను బీజేపీ సైతం అదే స్థాయిలో తిప్పికొట్టింది.