Arjun Suravaram
కోట్లాది మంది హిందూవులూ ఎన్నో ఏళ్లుగా కన్న కల నిరవేరింది. జనవరి నెలలో అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక రాములోరి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
కోట్లాది మంది హిందూవులూ ఎన్నో ఏళ్లుగా కన్న కల నిరవేరింది. జనవరి నెలలో అయోధ్యలో బాల రాముడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక రాములోరి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది.
Arjun Suravaram
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూవులూ ఎన్నో ఏళ్లుగా కన్న కల నిరవేరింది. జనవరి నెలలో అయోధ్యలో శ్రీరామచంద్రుడు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఎంతో అట్టహాసంగా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. అయితే బాలరాముడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి రామ భక్తులు అయోధ్యకు వెళ్తున్నారు. ఇదే సమయంలో భక్తుల సౌకర్యం కోసం రైల్వే శాఖ అయోధ్యకు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. తాజాగా అయోధ్య రామయ్య దర్శనం విషయంలో ఏపీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీ ప్రజలు అయోధ్యకు వెళ్లేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది అయోధ్యకు వెళ్లి రామయ్యను సందర్శించుకున్నారు. అలానే ఇంకా చాలా మంది బాల రాముడిని దర్శించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయినా ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రాల యాత్రకు స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు విజయవాడ రీజనల్ మేనేజరు రాజా తెలిపారు. అయోధ్యతో పాటు మరికొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు పూరీ, కోణార్క్, గయ, వారణాసి, ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తుందన్నారు.
ఇక అయోధ్యకు వెళ్లే ఈ స్పెషల్ ట్రైన్ సమయపాలన వివరాలను కూడా రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక ట్రైన్ సికింద్రబాద్ నుంచి బయటలు దేరి.. విజయవాడ మీదు ఏపీలోని వివిధ స్టేషన్లలో ఆగుతుంది. ఈనెల 27న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్ల కోట మీదుగా వెళ్తుందని అధికారులు తెలిపారు. ఇదే ట్రైన్ తిరిగి మే 6న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. ఇక ఈ రైలు గురించి పూర్తి వివరాల కోసం 92814 95848, 89773 14121 నంబర్లలో సంప్రదించవచ్చని తెలియజేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
అయోధ్యకు సంబంధించిన ప్రత్యేక రైలు గురించి ఇలా ఉంటే..వేసవి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఏప్రిల్16, 23, 30 తేదీల్లో హైదరాబాద్-కటక్(07165) ప్రత్యేక రైలు నడవనుంది. అలానే 17, 24, మే 1 తేదీల్లో కటక్ నుంచి హైదరాబాద్(07166) ప్రత్యేక రైళ్లు నడవనుంది. రెండు ప్రత్యేక రైళ్లు కూడా రాజమండ్రి, సామర్ల కోట, అన్నవరం, విజయవాడ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. అలానే సికింద్రబాద్ నుంచి సంత్రాగచ్చి 07223 అనే ప్రత్యేక రైలును ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకు నడపనున్నారు.
అలానే సంత్రాగచ్చి నుంచి సికింద్రాబాద్ కు 07224 అనే స్పెషల్ ట్రైన్ ను ఏప్రిల్ 20 నుంచి జూన్ 29వరకు నడపనున్నారు. ఈ రెండు రైళ్లు కూడా రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగుతాయన్నారు. అలానే సికింద్రబాద్ షాలిమార్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఇవి రాజమండ్రిసామర్లకోటతో పాటు తుని స్టేషన్లలో ఆగుతాయని పేర్కొన్నారు. ఇక వేసవిలో తిరిగే ప్రత్యేక రైళ్ల వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. మరి.. అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.