iDreamPost
android-app
ios-app

నేను అయోధ్యలోనే పెళ్లి చేసుకుంట.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

  • Published Jan 28, 2024 | 6:36 PM Updated Updated Jan 28, 2024 | 6:36 PM

ఈ నెల 22 న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు, సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగానికి చెందిన వారు వచ్చారు.

ఈ నెల 22 న ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు, సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగానికి చెందిన వారు వచ్చారు.

  • Published Jan 28, 2024 | 6:36 PMUpdated Jan 28, 2024 | 6:36 PM
నేను అయోధ్యలోనే పెళ్లి చేసుకుంట.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

భారత దేశంలో హిందువులు దాదాపు 500 ఏళ్ల పాటు ఎదురు చూసిన అద్భుత ఘట్టం ఈ నెల 22 న పూర్తయ్యింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 22న అభిజిత్ లగ్నమందు రామ మందిర్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రములు, వేల సంఖ్యల్లో భక్తులు విచ్చేశారు. మరుసటి రోజు నుంచి బాల రాముడి దర్శనానికి అనుమతి ఇచ్చారు. దీంతో లక్షల సంఖ్యల్లో రాం లల్లాను దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. ఇందులో సినీ ప్రముఖలు, రాజకీయ ఇతర రంగాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తాజాగా స్టార్ హీరో తన పెళ్లి విషయం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ గౌడ దాదాపు పదేళ్ల నుంచి ఐశ్వర్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. త్వరలో ఆమెను పెళ్లాడబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల నిశ్చితార్థం కూడా అయ్యింది. అయితే పెళ్లి ఎప్పుడు అని రామ్ గౌడ్ ని పలువురు అడిగారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. రామ్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ఐశ్వర్య అనే అమ్మాయిని పదేళ్లుగా ప్రేమించాను. ఆమె చాలా నిజాయితీగా ఉండే అమ్మాయి.. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నాకు సినిమాలతో పాటు బిజినెస్ కూడా ఉంది. ప్రస్తుతం నేను ఒక రెస్టారెంట్ నడిపిస్తున్నాను. అటు సినిమాలు, ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను. త్వరలో దర్శకుడిగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాను.

kannada star hero rama goeda

నేను మొదటి నుంచి శ్రీరామ భక్తుడను.. ఇటీవల అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం చేశారు. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. అందుకే నేను రామలయ ప్రారంభోత్సవం నాడే ఎంగేజ్ మెంట్ చేసుకున్నా.. త్వరలో అయోధ్యలో శ్రీరాముల వారి సమక్షంలో పెండ్లి చేసుకోవాలని నిశ్చియించుకున్నాను. పెళ్లి విషయంలో నా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. జీవితంలో స్థిర పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలన్న నా కోరిక తీరబోతుంది’ అని అన్నారు. ప్రస్తుతం హీరో రామ్ గౌడ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş