Keerthi
అయోధ్యలోని గతవారం రోజుల నుంచి వేలాది మంది రామ భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు ఓ సాధారణ హోటల్ కి టీ తాగాడానికి వెళ్లగా అక్కడ ధర చూసి షాక్ అయిపోయాడు. ఇంతకి అక్కడ ధర ఎంతంటే..
అయోధ్యలోని గతవారం రోజుల నుంచి వేలాది మంది రామ భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఓ భక్తుడు ఓ సాధారణ హోటల్ కి టీ తాగాడానికి వెళ్లగా అక్కడ ధర చూసి షాక్ అయిపోయాడు. ఇంతకి అక్కడ ధర ఎంతంటే..
Keerthi
ఎట్టకేలకు హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. ఎంతో అద్భుతంగా అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. అలాగే ఎంతో అంగరంగ వైభవంగా ఈనెల 22న ఆ బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాని చేతుల మీదుగా జరిగింది. ఇంతటి అపురూప వేడుకను దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంది. వేదపండితులు సాక్షిగా మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛరణల మధ్య ఎంతో కన్నుల పండుగగా ఆ కోదండ రాముడు తన జన్మ స్థానంలో కొలువుదీరాడు. ఈ వేడుకను చూడటం కోసం దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు, ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు. ఇక ఆ తర్వాత రోజు నుంచి సాధారణ భక్తులకు ఆ బాల రాముని దర్శనభాగ్యన్ని కల్పించే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి వెళ్తున్నారు.
అయితే తాజాగా అయోధ్యకు వెళ్లిన భక్తులు ఓ సాధారణ రెస్టారెంట్ లోని టీ ధరను చూసి షాక్ కు గురయ్యారు. అయోధ్యలోని గత వారం రోజుల నుంచి వేలాది మంది రామ భక్తులు తరలి వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు అయోధ్య మొత్తం భక్తుల రద్దీతో పోటెత్తుతున్నారు. అలాగే ఒకపక్క విపరీతమైన చలి ఉండటంతో భక్తులు వేడి వేడిగా టీ తాగాలని అనుకోవడం సహజం. మామూలుగా టీ అంటే 10 రూపాయలు ఉంటుంది. మహా అయితే 20 రూపాయలు. కానీ మరీ టూమచ్ కాకపోతే 55 రూపాయలకు అమ్ముతున్నారు. అలా అని అదేమీ పెద్ద హోటల్ కూడా కాదు. ఒక సాధారణ హోటల్. కొంతమంది భక్తులు సమీపంలో ఉన్న ‘మాతా శబరి’ అనే హోటల్ కి వెళ్లి రెండు టీ, రెండు టోస్ట్ వైట్లు ఆర్డర్ చేశారు.
ఒక్కో టీ 55 రూపాయల చొప్పున రెండు టీలకి 110 అవ్వగా, టోస్ట్ వైట్ కి 65 రూపాయల చొప్పున రెండిటికీ 130 రూపాయలు అయ్యింది. జీఎస్టీతో కలిపి మొత్తం బిల్లు 252 రూపాయలు అయ్యింది. దీంతో ఒక్కసారిగా కస్టమర్లు షాకయ్యారు. దీనికి సంబంధించిన బిల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ సదరు రెస్టారెంట్ ఓనర్ కి షోకాజ్ నోటీసులు పంపించింది. 3 రోజుల్లోగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో ఆ హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసింది. అయోధ్యలో నిత్యం లక్షలాది మంది భక్తులు ఆ రాముడి దర్శనం కోసం క్యూ కడుతున్నారు.
దీంతో విపరీతమైన భక్తుల తాకిడి ఉండటంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు అనేవి సమీపంలో భారీగా పెరిగిపోయాయి. అయితే రామ మందిర ప్రారంభానికి ముందు మాత్రం ఒక టీ ధర 10 నుంచి 20 రూపాయలు ఉండేదని, ఇప్పుడు భక్తులు సంఖ్య భారీగా పెరగడంతో ఒక ఛాయ్ ధర రూ. 55కు పెంచారని విమర్శిస్తున్నారు. సాక్షాత్తు రాముడు జన్మించిన రామ రాజ్యంలో ఇదేమీ దోపిడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, అయోధ్యలో ఎక్కువ ధరకు టీ విక్రయిస్తుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
After the restaurant bill of Rs 252 for tea & toasts went viral on social media, the Ayodhya Development Authority (ADA) has issued a show-cause notice to the restaurant owner.https://t.co/YczFORzBu4 pic.twitter.com/lLCXmA3D8m
— The Times Of India (@timesofindia) January 29, 2024