అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని, మూడు రాజధానులు వద్దని 300 రోజులకు పైగా జరుగుతున్న అమరావతి ఉద్యమ జ్వాలను ఆరకుండా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా అయితే.. వారితో పోటీ పడుతున్న క్రెడిట్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు దక్కుతుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పోటీగా సీపీఐ రామకృష్ణ కూడా అమరావతి వాయిస్ను వినిపిస్తున్నారు. బాబుకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలో […]
చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా తయారయ్యింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే.. అని ఘనంగా చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకున్నాకూడా ఆ పార్టీ నేతల వ్యవహారశైలిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ సాక్షిగా నిత్యం అంతర్గత కుమ్ములాటల్లో మునిగి తేలే ఆ ఆపార్టీ నాయకుల వ్యవహార శైలితో పార్టీ ఇప్పటికే భారీ […]
డోన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ తరుపున కౌన్సిలర్ లుగా పోటీ చెయ్యబోయే అభ్యర్థులను బెదిరించి, వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. డోన్ లో వైసిపి నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయిందని కేయీ కృష్ణమూర్తి ఆరోపించారు. దానికి నిరసనగా డోన్ పట్టణంలో ఎన్నికలను […]
మధ్యప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంకృత అపరాధమే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు ఈ విషయంలో అన్ని వేళ్ళు కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతనే ఎత్తి చూపుతున్నాయి. కష్టకాలంలో పార్టీలో సంస్థాగతంగా స్థానిక యువనాయకత్వాన్ని ప్రోత్సహించి పార్టీకి జవసత్వాలు కల్పించాల్సింది పోయి, ఎంతసేపటికి భజనపరులకే ప్రాధాన్యమిస్తూ వారినే అందలం ఎక్కించడం వల్లనే పార్టీ కి ఈ దుస్థితి దాపురించిందని సాక్షాత్తు కొందరు కాంగ్రెస్ సీనియర్ […]
అనేక దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, చీరాల శాసనసభ్యుడు కరణం బలరామ కృష్ణమూర్తి (కరణం బలరాం) ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరుతున్న సందర్భంగా ఆయన చేరికపై వైసిపి తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో పెద్దఎత్తున చర్చకు తెర లేచింది. కరణం బలరాం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించటంతో నష్ట నివారణలో భాగంగా చంద్రబాబు పర్చూరు ,అద్దంకి శాసనసభ్యులతో అత్యవస సమావేశం నిర్వహించారు. ప్రకాశం […]
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సరం సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రజినీకాంత్ కొద్దిసేపట్లో నిర్వహించే మీడియా సమావేశంపై తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుండి రజినీకాంత్ రాజకీయప్రవేశంపై తమిళనాడులో చర్చ జరుగుతుంది. గతంలోనే రజిని రాజకీయ ప్రవేశం చేయనున్నానని తమిళనాడు ప్రజలకు స్పష్టతనిచ్చారు కానీ, పార్టీ పెట్టబోతున్నట్లు మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాగా కొద్దిరోజుల క్రితం అభిమానులతో నిర్వహించిన సమావేశంలో తాను కొందరిని నమ్మి మోసపోయానని రజినీకాంత్ వ్యాఖ్యానించడం […]
చినబాబూ మీరు ఎక్కడున్నా తక్షణమే ఇంటికి రావాలి..మీరు మాకు కనిపించక చాలా రోజులు అవుతోంది..ఈ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయినా నిన్ను ఎవరూ ఏమీ అనరు… నీ మీద బెంగెట్టు కున్నాం..గమ్మున ఇంటికి రావాలని మా కోరిక .. ఇదీ ఓ హార్డ్ కోర్ టిడిపి కార్యకర్తలు ఇలా కోరుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చినబాబు లోకేష్ హవా అంతా ఇంతా కాదు.. ఆయన జోక్యం లేని నియోజకవర్గం గాని, డిపార్ట్మెంట్ గానీ లేదన్నది జగద్విదితం. కర్నూల్ ఉప […]
టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసారు. ఈ మేరకు ఒక బహిరంగలేఖను ఆయన విడుదల చేసారు. గతంలో MLC పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా రాజీనామా లేఖలో టీడీపీ అధిష్టాన వైఖరి తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని డొక్కా వివరించారు. తాను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ సీటును ఆశించానని, కానీ నాటకీయ పరిణామాల మధ్య తనకు ప్రత్తిపాడు సీటును కేటాయించారని తెలిపారు. ఓటమి సంకేతాలు కనబడుతున్నా […]
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత మారిన రాజకీయ పరిణామాలలో అసెంబ్లీ ఇంచార్జ్ లు లేని నియోజకవర్గాలలో ఇటీవల కాలంలో కొత్త ఇంచార్జులను నియమించడం, స్థానిక కారణాలవల్ల కొందరు ఇంచార్జులకు కొత్త నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తున్న తెలుగుదేశం పార్టీ గత నెలలో 4 నియోజకవర్గాలకు కొత్తగా ఇంచార్జులను నియమించిన తరుణంలో తాజాగా శుక్రవారం మరో రెండు నియోజకవర్గాలకు ఇంచార్జులను ప్రకటించింది. దీనిలో భాగంగా చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు జిలా ప్రత్తిపాడు ఇంచార్జ్ గా సీనియర్ […]
స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెల 7న నోటిఫికేషన్లు వెలువడనున్నాయనే వార్తల నేపథ్యంలో పశ్చిమలోని పల్లెలు, పట్టణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీలన్నీ అభ్యర్థులు, సామాజిక సమీకరణాల లెక్కల్లో మునిగితేలుతున్నాయి. దీంతో జిల్లాలో ఆయా పార్టీల ప్రభావం, సన్నద్ధతలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా జనసేన–బీజేపీ కూటమి ఎలాంటి ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఉంది. ఏయే నియోజకవర్గాల్లో ఈ కూటమి ప్రభావం చూపేందుకు అవకాశం ఉందో ఒకసారి చూద్దాం….. ఇతర జిల్లాలతో పోల్చితే జనసేన రాజకీయాలు పశ్చిమగోదావరితో […]