Swetha
ప్రస్తుతం డార్లింగ్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అవ్వడానికి ఎంత లేదన్న ఒక ఐదారు సంవత్సరాలు పడుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది
ప్రస్తుతం డార్లింగ్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అవ్వడానికి ఎంత లేదన్న ఒక ఐదారు సంవత్సరాలు పడుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది
Swetha
ప్రస్తుతం డార్లింగ్ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అవ్వడానికి ఎంత లేదన్న ఒక ఐదారు సంవత్సరాలు పడుతుంది. డార్లింగ్ ఫ్యాన్స్ అయితే చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఇది కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పౌజీ’ , దీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ , సలార్, కల్కి చిత్రాలకు సీక్వెల్స్ ఇవి ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు.
అయితే ఇప్పుడు ప్రభాస్ మరో సిక్వెల్ కు సై అన్నాడట. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రాజాసాబ్ కు కూడా సీక్వెల్ ఉండబోతుందట. రీసెంట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు. అయితే ఇది మొదటి పార్ట్ కు కంటిన్యుటీగా ఉండదట. థీమ్, సెటప్ ఒకే తరహాలో ఉంటాయి కానీ కథ వేరేలా ఉంటుందట.
రీసెంట్ గా మారుతి ప్రభాస్ కు రాజాసాబ్ 2 స్టోరీకి సంబంధించిన లైన్‌ని చెప్పాడట. అది బాగా నచ్చడంతో చేసేద్దాం డార్లింగ్’అని ప్రభాస్ చెప్పినట్లు ఇన్సైడ్ టాక్. ఇది రావడానికి చాలా సమయం పడుతుందని ఈజీగా చెప్పేయొచ్చు. ప్రభాస్ ఇప్పుడు పౌజీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ కాగానే స్పిరిట్ . ఆ తర్వాత సలార్ 2 లేదా కల్కి 2 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలి. ఇవన్నీ పూర్తయ్యేవరకు దాదాపు రెండేళ్లు పడుతుంది. ఇక ఇప్పుడు రాజాసాబ్ రిజల్ట్ ను బట్టి.. రాజాసాబ్ 2 ఉంటుందా లేదా అనే కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.