iDreamPost
android-app
ios-app

చిరుతో కార్తీ.. ఊహించని కాంబో

  • Published Oct 27, 2025 | 11:03 AM Updated Updated Oct 27, 2025 | 11:03 AM

ఈ మధ్య కాలంలో క్యామియోలు చాలా కామన్ అయిపోయాయి. పెద్ద హీరోల సినిమాలో చిన్న హీరోలు రావడం లేదా చిన్న హీరోల సినిమాలో పెద్ద హీరోలు రావడం ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇక వీలైనప్పుడు మల్టి స్టారర్ సినిమాలు కూడా చేస్తూనే ఉన్నారు.

ఈ మధ్య కాలంలో క్యామియోలు చాలా కామన్ అయిపోయాయి. పెద్ద హీరోల సినిమాలో చిన్న హీరోలు రావడం లేదా చిన్న హీరోల సినిమాలో పెద్ద హీరోలు రావడం ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇక వీలైనప్పుడు మల్టి స్టారర్ సినిమాలు కూడా చేస్తూనే ఉన్నారు.

  • Published Oct 27, 2025 | 11:03 AMUpdated Oct 27, 2025 | 11:03 AM
చిరుతో కార్తీ.. ఊహించని కాంబో

ఈ మధ్య కాలంలో క్యామియోలు చాలా కామన్ అయిపోయాయి. పెద్ద హీరోల సినిమాలో చిన్న హీరోలు రావడం లేదా చిన్న హీరోల సినిమాలో పెద్ద హీరోలు రావడం ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఇక వీలైనప్పుడు మల్టి స్టారర్ సినిమాలు కూడా చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు చిరు విషయానికొస్తే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఆయన సినిమాల్లో చాలానే స్టార్లు నటించారు. ఇక ఇప్పుడు కూడా మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గానే వెంకీని వెల్కమ్ చేస్తూ చిరు ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిరంజీవి నటించబోయే తర్వాత సినిమాలో ఓ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్నారట. అది మరెవరో కాదు తెలుగు వారికి ఇష్టమైన తమిళ హీరో కార్తీ. మన శంకర వరప్రసాద్ గారు తర్వాత.. చిరు బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాలోనే కార్తీ ఓ స్పెషల్ రోల్ లో నటించబోతున్నాడట. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో హ్యాపెనింగ్ బేన‌ర్ల‌లో ఒకటైన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారట.

కార్తీకి తెలుగులో ఎలాంటి ఫాలోయింగ్ ఉందొ తెలియనిది కాదు. పైగా ప్రస్తుతం కార్తీ చేతిలో ఉన్నవి అన్నీ సిక్వెల్స్ , క్యామియోలే. రీసెంట్ గా హిట్ 3 క్లైమాక్స్ లో కార్తీని చూపించి సర్ప్రైజ్ చేశారు. ఇక ఈ సినిమాలో కార్తీ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.