Swetha
మనశంకర వరప్రసాద్ గారి వలన నయనతార మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. మూవీ అనౌన్సుమెంట్ నుంచి మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్స్ చేసింది నయనతార. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా భర్తతో విడిపోయిన మాజీ ఇల్లాలుగా చిరుతో కొన్ని సీన్స్ అలాగే..

మనశంకర వరప్రసాద్ గారి వలన నయనతార మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. మూవీ అనౌన్సుమెంట్ నుంచి మొన్న రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఆడియన్స్ ను బాగానే ఇంప్రెస్స్ చేసింది నయనతార. రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా భర్తతో విడిపోయిన మాజీ ఇల్లాలుగా చిరుతో కొన్ని సీన్స్ అలాగే.. వెంకటేష్ తో స్క్రీన్ షేరింగ్ సీన్స్ అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నాయని ఇన్సైడ్ టాక్.
ఈ సినిమా తర్వాత చిరు నెక్స్ట్ మూవీ ఏంటి అనేది ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. అలాగే నయన్ కూడా తన నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అది మరెవరతోను కాదు బాలకృష్ణతో. ఇప్పటికే బాలయ్య, నయనతార మూడుసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శ్రీరామ రాజ్యం, సింహ, జై సింహ సినిమాలు మంచి టాక్ సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో స్క్రీన్ మీద చూడడం అంటే ఫ్యాన్స్ కు ఖుషినే.
అయితే సినిమాకు సంబంధించి పెద్దగా డీటెయిల్స్ ఏమి బయటకు రాలేదు. కానీ రాజవంశీయులు బ్యాక్డ్రాప్ లో కథ ఉండబోతుందట. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్నారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలకృష్ణని ఈ సినిమాలో కొత్తగా చూపించబోతున్నారట. త్వరలోనే ఈ న్యూస్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇక ఎలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ బయటకు వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.