P Venkatesh
P Venkatesh
తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎలక్షన్ విషయమై తెలంగాణలో పర్యటిస్తోంది. ఎన్నికల సంఘం ప్రకటించిన తుది జాబితాలో మొత్తం ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389(3,17,17,389) మంది ఉన్నట్లు జాబితాను ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్లు 1కోటి 58 లక్షల 71 వేల 493 మంది(1,58,71,493), మహిళా ఓటర్లు 1కోటి 58 లక్షల 43వేల 339 మందిట(1,58,43,339) ట్రాన్స్ జెండర్లు 2వేల 557 (2,557) మంది ఓటర్లు ఉన్నారు.
కాగా ఇంకొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానుందంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తగినట్టుగానే తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సెంట్రల్ మరియు స్టేట్ ఎలక్షన్ కమిషన్లు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో సమీక్షాసమావేశాలు నిర్వహిస్తోంది.