iDreamPost
android-app
ios-app

మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. – కేఈ

మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. – కేఈ

డోన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ తరుపున కౌన్సిలర్ లుగా పోటీ చెయ్యబోయే అభ్యర్థులను బెదిరించి, వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. డోన్ లో వైసిపి నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయిందని కేయీ కృష్ణమూర్తి ఆరోపించారు. దానికి నిరసనగా డోన్ పట్టణంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు

అధికారపక్షంపై ఆరోపణలు చేస్తూ పోటీ నుండి తప్పుకుంటున్నామని కేఈ కృష్ణమూర్తి ప్రకటించినప్పటికీ.. వాస్తవానికి డోన్ పట్టణంలో మంచి పట్టున్నకేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ  ప్రతాప్ శుక్రవారం సోదరుడికి షాక్ ఇస్తూ తన వర్గంతో సామావేశం నిర్వహించి తెలుగుదేశానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం కూడా కారణమని తెలుస్తుంది. ఇదే సమయంలో గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి తన చిన్న తమ్ముడయిన కేఈ ప్రతాప్ ని ఒకసారి, తన కుమారుడు కేఈ శ్యామ్ బాబు ని ఒక సారి డోన్ నుండి అసెంబ్లీ బరిలోకి దించినప్పటికీ ఓటమి పాలవడంతో, కేయీ కుటుంబానికి డోన్ పై క్రమంగా పట్టు సడిలింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం తరపున పోటీ చెయ్యడానికి అభ్యర్థులు ముందుకు రాకపోవడం, ఒకరిద్దరు పోటీ చెయ్యడానికి ఆసక్తి చూపినప్పటికీ వారి ఆర్ధిక భారాన్ని తానె భరించాల్సి రావడం వలెనే కేఈ కృష్ణమూర్తి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి