Swetha
తెలుగు ఆడియన్స్ కు కావాల్సింది కంటెంట్ మాత్రమే. కథ నచ్చితే అది స్ట్రెయిట్ తెలుగు సినిమా అయినా.. తమిళ మలయాళ డబ్బింగ్ సినిమాలైనా సరే నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. పైగా సినిమాలతో పాటు ఆ సినిమాలలో నటించిన హీరోలకు కూడా అంతే ఫ్యాన్ బేస్ పెంచుతారు. ఇలా తెలుగులో ఫేమస్ అయిన తమిళ హీరోలలో ధనుష్ కూడా ఒకరు.
తెలుగు ఆడియన్స్ కు కావాల్సింది కంటెంట్ మాత్రమే. కథ నచ్చితే అది స్ట్రెయిట్ తెలుగు సినిమా అయినా.. తమిళ మలయాళ డబ్బింగ్ సినిమాలైనా సరే నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. పైగా సినిమాలతో పాటు ఆ సినిమాలలో నటించిన హీరోలకు కూడా అంతే ఫ్యాన్ బేస్ పెంచుతారు. ఇలా తెలుగులో ఫేమస్ అయిన తమిళ హీరోలలో ధనుష్ కూడా ఒకరు.
Swetha
తెలుగు ఆడియన్స్ కు కావాల్సింది కంటెంట్ మాత్రమే. కథ నచ్చితే అది స్ట్రెయిట్ తెలుగు సినిమా అయినా.. తమిళ మలయాళ డబ్బింగ్ సినిమాలైనా సరే నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. పైగా సినిమాలతో పాటు ఆ సినిమాలలో నటించిన హీరోలకు కూడా అంతే ఫ్యాన్ బేస్ పెంచుతారు. ఇలా తెలుగులో ఫేమస్ అయిన తమిళ హీరోలలో ధనుష్ కూడా ఒకరు. ఈ ఏడాది కుభేర లాంటి సినిమాతో హిట్ అందుకున్న ధనుష్ నుంచి వచ్చిన మరో సినిమా ‘ఇడ్లి కొట్టు’.
ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడో లెక్కలు కుదరలేదు. ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ అది థియేటర్ టాక్ మాత్రమే. ఏమో ఓటిటిలో ఈ సినిమా అందరిని ఇంప్రెస్ చేసినా చేయొచ్చు. అందుకే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. శంకరాపురం అనే ఊరిలో రాజ్ కిరణ్ ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఆ చుట్టూ పక్కల ఏరియా లో అతని ఇడ్లిలు చాలా ఫెమస్ . అతని కొడుకు ధనుష్ మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్‌మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత తన కంపెనీ ఓనర్ కూతురిని పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతాడు. సరిగ్గా పెళ్ళికి ముందు అమ్మాయి తండ్రి చనిపోతాడు. సో ధనుష్ తిరిగి ఊరికి వస్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే సినిమా కథ. అక్టోబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి ఈ సినిమా ను థియేటర్లో మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.