iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది

  • Published Oct 27, 2025 | 11:56 AM Updated Updated Oct 27, 2025 | 11:56 AM

ఇంకో రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వస్తుంది. కానీ టాలీవుడ్ లో మాత్రం అప్పుడే మొదలైపోయింది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేయాల్సిన సినిమాలు పోటాపోటీగా ప్రమోషనల్ అప్డేట్స్ ఇస్తున్నాయి. ఇయర్ మొత్తంలో ఎక్కువ రెవిన్యూ ఇచ్చే సీజన్ గా భావించే ఈ పండగకు.. యావరేజ్ సినిమాలు సైతం మంచి లాభాల్లో ఉండొచ్చని ఈ సీజన్ ను ఎంచుకుంటారు.

  • Published Oct 27, 2025 | 11:56 AMUpdated Oct 27, 2025 | 11:56 AM
టాలీవుడ్ సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది

ఇంకో రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వస్తుంది. కానీ టాలీవుడ్ లో మాత్రం అప్పుడే మొదలైపోయింది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ కు రిలీజ్ చేయాల్సిన సినిమాలు పోటాపోటీగా ప్రమోషనల్ అప్డేట్స్ ఇస్తున్నాయి. ఇయర్ మొత్తంలో ఎక్కువ రెవిన్యూ ఇచ్చే సీజన్ గా భావించే ఈ పండగకు.. యావరేజ్ సినిమాలు సైతం మంచి లాభాల్లో ఉండొచ్చని ఈ సీజన్ ను ఎంచుకుంటారు. అయితే ఈసారి రాబోయే సంక్రాంతికి మాత్రం పోటీ చాలా టఫ్ గా ఉండబోతుందంట.

ముందుగా జనవరి 9 ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వస్తాడు. ఎలాగూ సినిమా హిట్ టాక్ నే సంపాదించుకుంటుంది. సో స్క్రీన్స్ తగ్గించే ప్రసక్తే ఉండదు. ఇక మూడు రోజుల తర్వాత అంటే జనవరి 12 న మన శంకర వర ప్రసాద్ గారు ఎంట్రీ ఇస్తారని ఫిలిం నగర్ న్యూస్. ఇప్పటికే కొన్ని ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాకైపోయారట. అడ్వాన్స్ లు కూడా ఇచ్చేశారట. ఆ తర్వాత రోజు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, 14న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, చివరిలో శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి’ సినిమాలు రానున్నాయి.

ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు విజయ్ ‘జన నాయకుడు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ కూడా సంక్రాంతి బరిలో ఉండబోతున్నాయి. మరి ఉన్న ఈ స్క్రీన్స్ లో అన్ని సినిమాలను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేదే పెద్ద ప్రశ్న. ఇక్కడ ఎవరికీ వారు ఎవరు తగ్గమని భీష్మించుకు ఉంటారో లేదా ఎవరైనా ఒకరిద్దరు వెనక్కు తగ్గుతారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.