అందరూ ఊహించినట్లుగానే ఏపీ బీజేపీకి మళ్లీ సినీ గ్లామర్ వచ్చింది. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్నారో లేదో తేలియని జయప్రద, రాజమండ్రి సభలో జాతీయ అధ్యక్షుడు నడ్డా పక్కన కనిపించారు. రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుండే రాజకీయాల్లోకి వెళ్లానంటూ లోకల్ టచ్ ఇచ్చారు. ఇక మీద ఏపీ బీజేపీలో జయప్రద బీజీగా కనిపించొచ్చు. అసలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బీజీ కాబోతున్నానని ఆమె ప్రైవేట్ సంభాషణల్లో చెప్పడంతోనే, అందరూ తెలంగాణ రాజకీయాల్లో జయప్రద అడుగు పెడతారని, వీలైతే […]
భారతీయ జనతా పార్టీకి దేశమంతటా కొత్త ఊపొచ్చింది. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక కాస్తో, కూస్తో పట్టున్న రాష్ట్రాలపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టి కమలం ఖాతాలో వేసుకోవాలన్న కోరిక పెరుగుతోంది. దీనిలో భాగంగా బీజేపీ దృష్టి ప్రధానంగా తెలంగాణపై పడింది. పక్కనే ఉన్న ఏపీలో కూడా పట్టు పెంచుకోవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ […]
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం హిందూ వ్యతిరేక పార్టీలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ సునీల్ థియోధర్ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. రాజమహేంద్రవరంలో బుధవారం పార్లమెంట్ స్థాయి శక్తి కేంద్రాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. హిందూ వ్యతిరేక పార్టీలని టీడీపీ, వైఎస్సార్ సీపీలను తీవ్రంగా విమర్శించడమే కాక భవిష్యత్తులో బీజేపీ, జనసేన కలసి ప్రయాణం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 2014 నుంచి 2018 వరకు […]
pawan party symbol: రాష్ట్రంలో జనసేన పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. పార్టీ ప్రారంభించిన 2014 సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అధికార బీజేపీతో గట్టి సంబంధాలే ఏర్పాటు చేసుకుంది. అయితే ఆ తర్వాత 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లో పరాజయం పొందారు. ఈ ఎన్నికల్లో పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే […]
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజల ఆమోదం ఉండదు. అలాంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా.. సదరు ఆస్తి ఉన్న ప్రాంతంలోని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొవాల్సిందే. వైజాగ్ స్టీల్‌ను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విశాఖ నగర వాసులే కాదు యావత్ ఏపీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్నారు. పైగా స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక గొప్ప చరిత్ర ఉంది. భూములు, ప్రాణ త్యాగాలు […]
ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో జనసేనతో కలసి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత ఆ పార్టీ పని తీరు పూర్తిగా మారిపోయింది. ఏపీలో ఆది నుంచి టీడీపీకి బి పార్టీలానే బీజేపీ ఉంది. ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం ఇప్పటికే మొదలైంది. టీడీపీ స్థానంలోకి రావాలని బీజేపీ నేతలు లక్ష్యాలు […]
ఏపీ బీజేపీపై ఒత్తిడి పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ఇంకా ఎన్నికలు సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే పెరగడం ఎందుకు మొదలైందన్నదానికి తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికను కారణంగా చూపుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటి వరకు తెలంగాణా బీజేపీ రెండు ఎన్నికలను ఎదుర్కొంది. దుబ్బాక ఉప ఎన్నికతోపాటు, జీహెచ్‌యంసీ ఎన్నికలు ఈ రెండూనూ. వాటిలో దుబ్బాకలో అనూహ్య విజయం దక్కించుకోగా, జీహెచ్‌యంసీలో కూడా అధికార పార్టీ కంటే కేవలం పదిశాతం ఓట్లు మాత్రమే వెనకబడి ప్రత్యర్ధులకు […]
ఒక్కో ఎన్నికల ఫలితాలు అంతే.. అనేక సమాధానాలు చెప్పడంతో పాటు, మరికొన్ని ప్రశ్నలు కూడా పుట్టిస్తుంటాయి. ప్రస్తుతం జీహెచ్‌యంసీ ఎన్నికల ఫలితాల తీరు అలాగే ఉంది. అధికార, ప్రతి పక్షాల వ్యూహాలను పూర్తిగా మార్చివేసే విధంగానే ఈ ఫలితాలు వచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు పరిశీలకులు. అంతే కాకుండా ఈ ఎన్నికల ఫలితాలు ఇతర రాష్ట్రాల్లో ఆయా పార్టీల వ్యూవహాలను కూడా ప్రభావితం చేసే విధంగా కూడా ఉన్నాయన్నది అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో […]
అయిదేళ్ళ కోసారి ఓటు వేసే అవకాశం వస్తుంది. అలా వచ్చినప్పుడు బ్యాలెట్ పేపర్‌పై ఉన్న అభ్యర్ధుల్లో ఎవరో ఒకరికి ఓటు వేసి హమ్మయ్య ఓటును సద్వినియోగం చేసేసుకున్నాం అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కానీ సదరు అభ్యర్ధులు ఎవ్వరూ నచ్చకపోతే.. అప్పుడు వేరే ఆప్షన్‌లేక ఉన్న వాళ్ళలో ఎక్కువ నచ్చినోళ్ళకే వేసేసి ఊరుకునే వారు. కానీ 2013 నుంచి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. బ్యాలెట్ పేపర్లో నోటా (నన్ ఆఫ్ ది అబౌ)ను ఏర్పాటు చేయడం […]
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణాలో బీజేపీకి మొన్నటి సాధారణ ఎన్నికల్లో దక్కిన ఫలితాల కన్నా ఇదే ఎక్కువ సంతృప్తినిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట హోరాహోరీ పోరులో విజయం సాధించడం రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తెను ఓడించిన ధర్మపురి అరవింద్ గెలుపు కన్నా ట్రంప్ కార్డ్ అనుకునే హరీష్ రావు ఎత్తులను చిత్తు చేసిన రఘునందన్ రావు విజయమే జోష్ నింపుతుంది. అదే ఊపులో త్వరలోనే […]