ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఉదయాన్నే నిద్రలేస్తూనే ఫోన్ చేతపట్టి ఇ – పేపర్ ఓపెన్ చేశాను. ముందు సాక్షి చూశాను. వెలుగులోకి వచ్చిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ల భేటీ అంశం బ్యానర్ వార్త అయింది. జరిగిన ఘటనతోపాటు ‘గూడు పుఠాణి’ అనే శీర్షికతో విశ్లేషణతో కూడిన కథనం, ఈ అంశంపై సుజనా చౌదరి వివరణ, వైసీపీ, టీడీపీ నేతల స్టేట్మెంట్లు కనిపించాయి. అలా అన్ని పేజీలు తిప్పిన తర్వాత ఈనాడు ఇ–పేపర్‌ను ఓపెన్ […]
ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపడమే లక్ష్యంగా అసత్య అభియోగాలు మోపిన ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు పరువు నష్టం దావాతోపాటు చట్ట ప్రకారం ప్రభుత్వం తీసుకునే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మాజీ సిఎం చంద్రబాబుతోపాటు ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు), ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి)కి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి […]
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పత్రికల స్టాండ్ పార్టీల వారీగా మారుతుంటుందని ప్రత్యేకంగా చెపాల్సినపని లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో నిత్యం ప్రభుత్వానికి అనుకూలమైన కథనాలు వస్తుండేవి. ఆ సమయంలో సాక్షి ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది. ఏడాది క్రితం నుంచి వైసీపీ పాలన మొదలైంది. పత్రికలు తమ పనితీరును మార్చేశాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాస్తుండగా.. సాక్షి ప్రభుత్వ అనుకూల కథనాలకు ప్రయారిటీ ఇస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక కథనాలు […]
జూన్ 10న ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త “సొంత సంస్థకు లీజు పెంపా ?”, ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో వచ్చిన వార్త “సొంత కంపెనీకి మేలు సిగ్గుచేటు” పై క్షమాపణలను కోరుతూ సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసు జారీ చేశారు. ఈ మేరకు గనులు, భూగర్భ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటీసులు జారీ చేశారు. ఈ వార్తాలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. జూన్ 10 తేదీన ఈనాడు దినపత్రికలో “సొంత సంస్థకు లీజు […]
ఉదయంలో నేను పనిచేయలేదు. కానీ జర్నలిస్టుగా మారడానికి అదే ప్రేరణ. ఉదయం రావడం రావడమే ఒక సంచలనం. ప్రింటింగ్ క్వాలిటీతో పాటు చదివించే శైలి, కథనాలు అద్భుతంగా ఉండేవి. రాయలసీమలో ఈనాడుకి ముందు ఆంధ్రప్రభ రాజ్యమేలేది. వారం క్రితం సద్ది వార్తలు (జిల్లా న్యూస్) మోసుకుని రాయదుర్గం లాంటి చిన్న ఊళ్లకి నిదానంగా సాయంత్రం వచ్చేది. ఈనాడు వచ్చి తెల్లారగానే పేపర్ చదవడం అలవాటు చేసింది. అయితే అది తెలుగుదేశం కరపత్రికగా మారిన ఒక సంక్లిష్ట సమయంలో […]
“అమరావతికి వెళ్ళి అక్కడి రైతులను కలవటానికి ఇష్టపడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కలిసి కోర్కెల చిట్టా ఇవ్వటాన్ని సినీపెద్దలు ఎలా సమర్ధించుకుంటారు’’? తాజాగా సినీ ప్రముఖలను ఉద్దేశించి ఎల్లోమీడియాలో రాసిన కొత్తపలుకు’ లో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వేసిన ప్రశ్న. నెలల తరబడి ఉద్యమం చేస్తున్న రైతులను కలవకుండా కేవలం సిఎంను మాత్రమే కలిసి తమ సమస్యలపై చర్చించి వచ్చేయటం ఏమిటంటూ రాధాకృష్ణ నిలదీయటం ఏ జర్నలిజమో ఆయనే చెప్పాలి. ఈమధ్యనే హైదరాబాద్ నుండి […]
ఆంధ్రజ్వోతి దినపత్రిక ఎడిటర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాథమిక విచారణ జరపకుండా కేవలం పత్రికలో వచ్చిన వార్తా కథనం ఆధారంగా ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంపై హైకోర్టు స్పందించింది. సస్పెండ్ చేస్తూ కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జారీచేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలుపుదల చేసింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్, ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ […]
ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోలో పేరుతో దాని యజమాని వేమూరి రాధాకృష్ణ రాసే కొత్తపలుకులో విచిత్రమైన సామెతను ఉపయోగించాడు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏడాది కాలంలో ఏమి జరిగందంటే అప్పు చేసి పప్పుకూడు తింటున్నట్లు చెప్పాడు. అభివృద్ధి కార్యక్రమాలను జగన్ గాలికొదిలేసి కేవలం సంక్షేమ కార్యక్రమాలను మాత్రం అమలు చేస్తున్నాడట. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం ద్వారా జనాలకు దగ్గరవ్వటానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలతో జనాలందరూ జేజేలు కొడుతున్నారంటూ తెగ బాధపడిపోయాడు. సరే […]
మే 23వ తేదీ.. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ తమదే విజయం అనుకున్న టీడీపీ, ఆ పార్టీ మద్ధతు మీడియాకు చెప్పపెట్టులాంటి తీర్పు ఈవీఎంల నుంచి వెలువడింది. తమ ఊహకందని ఓటమిని చవిచూడడంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియాగా పిలిచే పత్రికలు, టీవీ ఛానెళ్లు ఖంగుతిన్నాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లతో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. 25 ఎంపీ సీట్లకు గాను 22 గెలుచుకుంది. టీడీపీ కేవలం […]
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడును నమ్ముకున్నందుకు ఎల్లోమీడియాపై గట్టి దెబ్బే పడింది. తాజాగా వెలుగు చూసిన ఇండియన్ రీడర్స్ షిప్ సర్వేలో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల సర్క్యులేషన్ దారుణంగా పడిపోయాయి. అదే సమయంలో సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ మాత్రం కొంచెం పెరిగింది. సర్క్యులేషన్ పడిపోతున్నా మొత్తంమీద ఇప్పటికీ ఈనాడు తన టాప్ పొజిషన్ ను అయితే నిలబెట్టుకున్నది. హోలు మొత్తం మీద చూస్తే ఈనాడు దినపత్రిక సర్క్యులేషన్ 82 లక్షల నుండి 63 లక్షలకు పడిపోయింది. అదే […]