iDreamPost
android-app
ios-app

క్షమాపణలు కోరుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ముందస్తు నోటీసులు

క్షమాపణలు కోరుతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు ముందస్తు నోటీసులు

జూన్ 10న ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త “సొంత సంస్థకు లీజు పెంపా ?”, ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో వచ్చిన వార్త “సొంత కంపెనీకి మేలు సిగ్గుచేటు” పై క్షమాపణలను కోరుతూ సంబంధిత వ్యక్తులకు ముందస్తు నోటీసు జారీ చేశారు. ఈ మేరకు గనులు, భూగర్భ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటీసులు జారీ చేశారు. ఈ వార్తాలను ఖండిస్తూ ప్రకటన విడుదల‌ చేశారు.

జూన్ 10 తేదీన ఈనాడు దినపత్రికలో “సొంత సంస్థకు లీజు పెంపా ?” అను శీర్షిక, అదే తేదీన ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో “సొంత కంపెనీకి మేలు సిగ్గుచేటు” అనే శీర్షికలతో వార్తలు ప్రచురితమైనది.

ముఖ్యమంత్రి సొంత సంస్ట అయిన సరస్వతి పవర్ పరిశ్రమ, దాచేపల్లి, గుంటూరు జిల్లాలో గల సున్నపురాయి మైనింగ్ లీజు కాలపరిమితిని 50 సంవత్సరాల పాటు పొడిగించుట సిగ్గుచేటు అని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. దీనిని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విపరీతంగా రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా రాశారు.

కేంద్ర ప్రభుత్వం ఎంఎం (డి&ఆర్) సవరణ చట్టం 2015 సెక్షన్ 8(ఎ) (3) ప్రకారం ఈ చట్టం కంటే ముందే మంజూరు చేయబడిన అన్ని మైనింగ్ లీజుల కాలపరిమితిని 50 సంవత్సరాలకు పొడిగించబడినది. కావున మెస్సర్స్ సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లీజు పునరుద్దరించేందుకు సవరణ చట్టం వర్తిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెస్సర్స్ సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వివిధ సర్వే నంబర్లలోని తంగేడు గ్రామం, దాచేపల్లి మండలం, చెన్నాయి పాలెం, వేమవరం గ్రామాలు, మాచవరం మండలం, గుంటూరు జిల్లా నందు 613.476 హెక్టార్ల విస్తరించిన సున్నపురాయి మైనింగ్ లీజును సెక్షన్ 8(ఎ) (3) ఎం.ఎం (డి&ఆర్) సవరణ చట్టం-2015 ప్రకారం పొందుపరిచి, జీవో 30ని జూన్ 8న ఇచ్చింది. దీంతో సదరు మైనింగ్ లీజును 50 సంవత్సరాలకు పొడిగించుటలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులులో ఏవిధమైన పక్షపాతం, ఏ సంస్థకు అనుకూలంగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది.

చట్టం అమలులోకి వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము 2015 జనవరి 11 నుండి మొత్తం 3౦ మైనింగ్ లీజుల యొక్క కాలపరిమితిని 50 సంవత్సరాలకు పొడిగించింది. అదే విధంగా చట్ట పరిధికి లోబడి మెస్సర్స్ సరస్వతి పవర్, ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లీజు కాలపరిమితిని కూడా 50 సంవత్సరాలకు పొడిగించబడినది. ఈ ప్రక్రియ పారదర్శకంగా చట్ట పరిదికి లోబడి మాత్రమే జరిగినదని తెలియజేసింది.

చట్టంలో పొందుపరచబడిన నిబంధనలు మేరకు మాత్రమే లీజు ఇచ్చినట్లు తెలియచేస్తూ ఇందులో ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించినచో అలాంటి వ్యక్తులు, సంస్థల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోంటామని, ఇలాంటి వ్యాఖ్యానాలు, వార్తలు పరువు నష్టం కింద పరిగణిస్తామని తెలియచేస్తూ ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సదరు రెండు దినపత్రికల యాజమాన్యాలు నిరాధార వార్తలు ప్రచురించి నందులకు ప్రభుత్వానికి 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలను తెలపవలని పేర్కొంది. ఒకవేళ‌ క్షమాపణలు తెలపకపోతే సదరు వ్యక్తులపై చట్టపరంగా పరువునష్టం దావా వేస్తామని, క్రిమినల్, సివిల్ దావాలు వేయడానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ముందస్తు నోటీసును జారీ చేశారు.