iDreamPost

V,RED,ఉప్పెన సినిమాలని OTT లో రిలీజ్ చేస్తే….? – TNR

V,RED,ఉప్పెన సినిమాలని OTT లో రిలీజ్ చేస్తే….? – TNR

ఇప్పుడున్న ఈ లాక్ డౌన్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడప్పుడే అంతా సర్దుకునేటట్టు లేదు.
లాక్ డౌన్ పూర్తయ్యాక అన్ని వ్యాపారాల మీద దీని ప్రభావం ఉంటుంది.
అన్ని వ్యాపారాల గురించి చెప్పేకంటే నాకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న సినిమా మీద నా అవగాహన చెబుతా.
ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నది పక్కనపెడితే లాక్ డౌన్ ని ఎప్పుడు ఎత్తేసినా కూడా మళ్ళీ బిజినెస్ కుదుటపడటానికి ఆగస్ట్ సెప్టెంబర్ అవుతుంది.
ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం చివరి వరకు అవుతుంది.
ఇక సినిమా విషయానికొస్తే…ఎంత జూలై ,ఆగస్ట్ లో లాక్ డౌన్ ఎత్తేసినా కూడా జనాలు సినిమా హాల్స్ కి రావడానికి భయపడతారు.
దాని వలన ఇప్పుడు రిలీజ్ కి ఆగిపోయిన సినిమాలని వెంటనే రిలీజ్ చెయ్యడానికి ప్రొడ్యూసర్స్ భయపడే పరిస్థితులే ఉంటాయ్.
ఆల్ రెడీ విడుదలకి రెడీగా ఉన్న పెద్ద బడ్జెట్ సినిమాలు…
1.నాని “V”
2.రాం “RED”
3.వైష్ణవ్ తేజ్ “ఉప్పెన”
ఇలాంటి బిగ్ బడ్జెట్ సినిమాలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో దసరా నే బెస్ట్ టైం…..
అంటే అక్టోబర్..
మరి అప్పటిదాకా వెయిట్ చేస్తే పెరిగిపోయే వడ్డీలను నిర్మాత ఆపగలడా…?
ఆల్ రెడీ కమిట్ అయిన డిస్ట్రిబ్యూటర్స్ ని ఆపగలడా…?
ఈ పరిస్థితుల్లో కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కొనడానికి వస్తారా….?
కొత్త డిస్ట్రిబ్యూటర్స్ రాకపోతే నిర్మాత సొంతంగా విడుల చేసుకునే ధైర్యం చేస్తాడా…?
ఒకవేళ దసరా టైం కి వీటిని రిలీజ్ చేసినా కూడా…అప్పటికి కరోనా ప్రభావం ఎలా ఉంటుంది,అప్పటికి కూడా జనాలు థియేటర్స్ రావడానికి భయపడతారా,ధైర్యంగా వస్తారా అన్నది అనుమానమే…
ఎందుకంటే…ఖచ్చితంగా ప్రాణాలకంటే సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యం కాదు.
ఒకవేళ జనాలు థియేటర్స్ కి రావడానికి సుముఖత చూపించినా కూడా కరోనా విషయం లో జాగ్రత్తగా ఉండటానికి గవర్నమెంట్ కొన్ని దేశాల్లో పాటిస్తున్న అల్టర్నేటివ్ సీటింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకువస్తే …?
అల్టర్నేటివ్ సీటింగ్ అంటే…ఒక్కొక్క ప్రేక్షకుడికి మధ్య ఒక సీట్ ఖాళీగా ఉంచడం.
అంటే థియేటర్ లో వెయ్యి సీట్స్ ఉంటే 500 వందల టికెట్స్ మాత్రమే కట్ అవుతాయ్.
ఒకవేళ అలాంటి కండీషన్స్ గవర్నమెంట్ పెడితే నిర్మాతకి ఎంత నష్టం..?
పోనీ మరి అలాంటి పరిస్థితుల్లో నిర్మాతని తృప్తిపర్చడానికి టికెట్ రేట్స్ ని పెంచుతారా…?
పెంచితే ప్రేక్షకులు వస్తారా…?
సో… ఇవన్నీ పెద్ద అనుమానాలే…
మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ముందు ఉన్న ఒకే ఒక్క గొప్ప ప్రత్యామ్నాయం OTT .
[ OTT అంటే “Over The Top” మీడియా సర్వీస్.like amazon,netflix etc ..
OTT అంటే తెలియని వాళ్ళ కోసమే ఈ వివరణ ]
ఆల్ రెడీ పైన చెప్పిన సినిమాలకు OTT ప్లాట్ ఫాంలో బిజినెస్ ప్రపోజల్స్ నడుస్తున్నాయనే మాట వినపడుతోంది…
రాం హీరోగా చేసిన “RED” సినిమాకి అమెజాన్ ప్రైం 20కోట్లు ఆఫర్ చేసిందని,“V”సినిమా విషయం లో కూడా ప్రపోజల్స్ నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయ్.
ఈ వార్తల్లో ఎంత నిజముందన్నది పూర్తిగా తెలియదు.
ఈ మూడు సినిమాలలో “ఉప్పెన” ని OTT లో రిలీజ్ చెయ్యడానికి ఆ టీం అంతగా సుముఖత చూపించకపోవొచ్చు.
ఎందుకంటే…అందులోని హీరో ఒక లాంచింగ్ హీరో అవడం.
అందులోనూ ఒక పెద్ద కాంపౌండ్ నుండి వస్తున్న హీరో అవడం.
ఒక లాంచింగ్ హీరో ఎప్పుడూ తన మొదటి సినిమా అనుభవం థియేటర్ లొనే అవ్వాలనుకుంటాడు కాబట్టి.
ఇక ఈ బిజినెస్ లెక్కలన్నీ కాసేపు పక్కనపెట్టి కొద్దిసేపు ఇంకోరకంగా ఆలోచిద్దాం.
సపోజ్ ఈ మూడు సినిమాలు “V”,”RED”.”ఉప్పెన” సినిమాలకి ఒక్కో సినిమాకి 30కోట్ల బడ్జెట్ అయిందనుకుందాం రఫ్ గా. [ ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు ]
అమెజాన్ లేదా నెట్ ఫ్లిక్స్ లేదా వేరే OTT ప్లాట్ ఫాం వాళ్ళు 20కోట్లు ఆఫర్ చేశారని అనుకుందాం.
అంటే ఇంకొక 10కోట్ల డెఫిసిట్…
ఆ పదికోట్లు సాటిలైట్ రూపంలోనో,హిందీ డిజిటల్ రైట్స్ రూపం లోనో వస్తాయ్ ఖచ్చితంగా…
నిర్మాత ఆశించినంత లాభాలు ఖచ్చితంగా రాకపోవొచ్చు.
కానీ ఇక్కడ విషయం కేవలం ఆ 30 కోట్లు రాబట్టడం కాదు.
ఒక థియేటర్ అనుభవాన్ని ప్రేక్షకులు కోల్పోతారు కదా అని ఆ సినిమా యూనిట్ ఆలోచించొచ్చు.
థియేటర్లో రిలీజ్ అయితే లాభాలు ఇంకా ఎక్కువ ఉంటాయ్ కదా అనే ఆలోచన ఉండొచ్చు.
కానీ ఈ కరోనా పరిస్థితులల్లో ఒకవేళ రేపు థియేటర్స్ లో రిలీజ్ అయినా కనీసం ఈ లాభాలు కూడా దక్కే అవకాశం ఉండకపోవొచ్చేమో…
రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరం చెప్పలేం…
థియేటర్స్ ఓపెన్ అయినా కూడా కరోనా ప్రభావం వలన జనాలు కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉందాం అనుకుంటే థియేటర్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయి, సినిమాలు గొప్పగా ఉన్నా కూడా కలెక్షన్స్ విషయం లో డిజాస్టర్స్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాలని OTT కి అమ్మేయడమే ఉత్తమమేమో..
అది ఇరవై కోట్లో,ఇరవై అయిదు కోట్లో… ఏదో ఒక ఒక బెస్ట్ ప్రైజ్ దగ్గర లాక్ అయిపోయి అమ్మేయడమే ఉత్తమమేమో…
ఇక అసలు విషయానికొస్తే …
ఇలా చెప్పడం లో, ఈ పోస్ట్ పెట్టడం లో నా అసలైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే…
స్టార్స్ నటించిన బిగ్ బడ్జెట్ కమర్షియల్ సినిమాల ప్రీమియర్స్ ని థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా OTT ప్లాట్ ఫాంస్ లో చూడటం గానీ,సాటిలైట్ చానల్స్ లో చూడటం గానీ ఇప్పటి వరకు మనం ఎక్స్పీరియెన్స్ చెయ్యలేదు.
అలా చేస్తే వాటి ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం అంచనా వేయలేకపోయాం.
గతం లో ఎప్పుడో కమలహాసన్ తన “విశ్వరూపం” సినిమాని DTH లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేద్దామనుకున్నారు.
అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ గొడవపడ్డారు… ఆగిపోయింది.
ఒకవేళ అప్పుడు అలా చేసి ఉన్నా ఆ ప్రక్రియ సక్సెస్ అయ్యేదని నేనయితే అనుకోను.
ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు.
అప్పుడు జనాలకి టెక్నాలజీ మీద ఉన్న నాలెడ్జ్ వేరు…
కానీ ..ఇప్పుడున్న పరిస్థితులు వేరు.
టెక్నలజీ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఒక పెద్ద కమర్షియల్ సినిమాని OTT ప్లాట్ ఫాం లో రిలీజ్ చేసి,ఆ ప్రక్రియ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని తెలుసుకోడానికి ఇంతకన్నా గొప్ప అవకాశం ఇక ముందు కూడా రాదేమో అన్నది నా అభిప్రాయం.
జనాలకి ఈ కరోనా టైం లో చాలా ఫ్రీ టైం దొరికింది కాబట్టి ఈ ప్రక్రియకి అత్యధికంగా మంచి ఫలితాలు రావడానికి ఇంతకన్నా మంచి సమయం భవిష్యత్తులో కూడా రాకపోవొచ్చు.
అసలు ఈ ప్రక్రియలో ఎలాంటి లాభనష్టాలున్నాయో తెలుసుకోడానికి అమెజాన్ ప్రైం & నెట్ ఫ్లిక్స్ లాంటి వాళ్ళకు కూడా ఇదొక చక్కటి అవకాశం.
ఆ ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికైనా,జనాలకి ఆ అనుభవాన్ని ఇవ్వడానికైనా, అనుకున్నదానికన్నా కొంచెం ఎక్కువ రేట్స్ ఇచ్చయినా సినిమాను కొనే రిస్క్ చెయ్యడం లో కూడా తప్పేమీ లేదు.
ఎందుకంటే…ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీరాదు కాబట్టి.
ఆ సినిమాల నిర్మాతలయినా రేట్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోయి రిస్క్
చేయాలి.
ఇదంతా కేవలం OTT ప్లాట్ ఫాం లో ఒక పెద్ద సినిమాని విడుదల చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోడానికే…ఆ అనుభవం కోసమే…
దీంట్లో ఎవరో ఒకరు రిస్క్ చేసి ముందడుగు వేయాల్సిందే…
అలా ముందడుగువేస్తే భావితరాలకు ఒక మార్గాన్ని సులభం చేసినవారవుతారేమో…
మీరు అలా విడుదల చేస్తే గనక ఆ ఫలితాలు బాగుంటే గనక…భవిష్యత్తులో నిర్మాతలు థియేటర్స్ కోసం గొడవపడకుండా మంచి సీజన్ కోసం వెయిట్ చేయకుండా ఎప్పుడయినా ధైర్యంగా విడుదల చేసుకోడానికి ఒక మంచి మార్గాన్ని చూపించిన వారవుతారు.
సినిమా చరిత్రలో ఇలాంటి కాన్సెప్ట్ లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి పెద్ద బడ్జెట్ కమర్షియల్
సినిమాగా మీ సినిమా పేరు గుర్తుండిపోతుంది.
రిలీజ్ చేసిన OTT ప్లాట్ ఫాం గా మీ ప్లాట్ ఫాం పేరు గుర్తుండిపోతుంది.[amazon,netflix whatever]
అటు నిర్మాతకైనా,ఇటు OTT ప్లాట్ ఫాం కయినా ఇద్దరికీ ఇది కేవలం లాభనష్టాలకు అతీతంగా తీసుకునే నిర్ణయమే…
ఇద్దరికీ ఈ నిర్ణయం తీసుకోవడం నేను చెప్పినంత సులభమేమీ కాకపోవొచ్చు…
కానీ తీసుకుంటే…చరిత్రలో గుర్తుండిపోయే నిర్ణయం మాత్రం అవుతుంది.. – TNR
—————————————-
[ గమనిక : నా ఈ పరిజ్ణానం, నా ఈ అవగాహన మీకు ఒప్పనిపించొచ్చూ,తప్పనిపించొచ్చూ..
నా ఆలోచన రైట్ అని నేను చెప్పను గానీ,మీ అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలనే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం.
ఈ పోస్ట్ కేవలం సినిమా వాళ్ళ గురించి,సినిమా ప్రేమికుల గురించి మాత్రమే.] 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి