ఎల్లుండి విడుదల కాబోతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమా ది వారియర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. వర్షాలు ఒకపక్క టెన్షన్ పెడుతున్నప్పటికీ రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందన్న వాతావరణ శాఖ అంచనా నిజం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న వారియర్ ముందు చాలా పెద్ద టార్గెటే ఉంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీకి 43 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. […]
ఇటీవలే అఖండతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న బోయపాటి శీను నెక్స్ట్ ఎవరితో చేస్తారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ లైన్ లోకి వచ్చాడట. లింగుస్వామి దర్శకత్వంలో చేస్తున్న ది వారియర్ అవ్వగానే బోయపాటితో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీంద్రరెడ్డినే దీనికీ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని వినికిడి. […]
ఇప్పుడున్న ఈ లాక్ డౌన్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడప్పుడే అంతా సర్దుకునేటట్టు లేదు. లాక్ డౌన్ పూర్తయ్యాక అన్ని వ్యాపారాల మీద దీని ప్రభావం ఉంటుంది. అన్ని వ్యాపారాల గురించి చెప్పేకంటే నాకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న సినిమా మీద నా అవగాహన చెబుతా. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నది పక్కనపెడితే లాక్ డౌన్ ని ఎప్పుడు ఎత్తేసినా కూడా మళ్ళీ బిజినెస్ కుదుటపడటానికి ఆగస్ట్ సెప్టెంబర్ అవుతుంది. ఇంకా […]
ఎన్నడూ లేనిది టాలీవుడ్ లో ఈ ఏడాది రీమేకుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. మన దర్శకులు రిస్క్ ఎందుకులే అనుకుంటున్నారో లేక రచయితలు హీరోలకు తగ్గట్టు కథలు రాయడంలో ఫెయిలవుతున్నారో తెలియదు కానీ మొత్తానికి అందరూ రీమేకుల బాట పట్టడం గమనార్హం. అందులోనూ వీటిని పేరున్న దర్శకులే హ్యాండిల్ చేయడం మరో విశేషం. ముందుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తన కంబ్యాక్ కోసం సోషల్ మెసేజ్ ఉన్న పింక్ రీమేక్ ని వకీల్ సాబ్ గా ఎంచుకోవడం […]
మార్చ్ లో ఒక్క నాని ‘వి’ తప్ప అంతా చప్పగా గడిచిపోతోందే అని ఫీలవుతున్న టాలీవుడ్ ప్రేమికుల కోసం ఏప్రిల్ లో ఫుల్ మీల్స్ రాబోతున్నాయి. క్రేజీ సినిమాలన్ని వరసగా రాబోతుండటంతో వేసవిలో కనువిందైన వినోదం పలకరించబోతోంది. ముందుగా ఏప్రిల్ 2నే తీసుకుంటే ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘ఉప్పెన’, అనుష్క రెండేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన ‘నిశబ్దం’, […]
సాధారణంగా సంగీత దర్శకుడు ఎవరైనా ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి మళ్ళీ కం బ్యాక్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏఆర్ రెహమాన్ సైతం మునుపటి మేజిక్ చేయలేక ఏదో బ్రాండ్ తో నెట్టుకొస్తున్నాడు కానీ ఇతని మ్యూజిక్ అభిమానులకు సైతం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. ఇళయరాజా, కోటి, కీరవాణి లాంటి అగ్రజులంతా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ అయితే రేర్ గా వస్తున్నాయి. మణిశర్మ […]
https://youtu.be/
https://youtu.be/