చూస్తుంటే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తన గురువు సుకుమార్ అడుగు జాడల్లోనే నడిచేలా ఉన్నాడు. మొదటి సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించి ఏడాది అవుతున్నా ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టనే లేదు. జూనియర్ ఎన్టీఆర్ తో నెక్స్ట్ ఉంటుందనే వార్తలు గట్టిగా వినిపించాయి కానీ దానికి సంబంధించి ఎలాంటి కదలిక కనిపించడం లేదు. మరోవైపు తారక్ ఆర్ఆర్ఆర్ అయిపోయాక కొరటాల శివకు కమిట్ అయ్యాడు. అదింకా రెగ్యులర్ షూట్ కు వెళ్ళలేదు. ఆచార్య విడుదలయ్యాకే స్టార్ట్ […]
కరోనా వల్ల థియేటర్లు మళ్ళీ కొన్ని నెలలు మూతబడాల్సి వచ్చినా సరే తెలుగు ప్రేక్షకులు మాత్రం తమ సినిమా ప్రేమని అభిమానాన్ని కలెక్షన్ల రూపంలో ఋజువు చేస్తూనే వచ్చారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక సంఖ్యలో సినిమాలు చూసింది మనవాళ్లే. ఇండియా బుక్ మై షో గణాంకాల ఆధారంగా చేసిన ఒక డేటా విశ్లేషణలో టాప్ మూవీ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా అనేది తెలుగు వాళ్ళ జీవితంలో ఎంత […]
ఈ ఏడాది ప్రారంభంలో లాక్ డౌన్ తీసేశాక వచ్చిన మొదటి బ్లాక్ బస్టర్ గా ఉప్పెన రేపిన సంచలనం ఏ స్థాయిలో వసూళ్లు తెచ్చిందో ఇంకా ఎవరూ మర్చిపోలేదు. మొదటి రోజే పది కోట్ల కలెక్షన్ కళ్లజూసిన డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ కు మంచి రికార్డు దక్కింది. దాని ప్రయోజనం కొండపొలంకు కలగలేదు అది వేరే విషయం. అంత గొప్ప విజయం సాధించాక కూడా దర్శకుడు బుచ్చిబాబు తర్వాతి సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జూనియర్ […]
సినిమా వాళ్లకు సెంటిమెంట్లు కాస్త ఎక్కువే, సినిమా ముహూర్తం మొదలు రిలీజ్ డేట్ వరకు ప్రతి విషయంలోనూ సెంటిమెంట్ ఫాలో అవుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా కొన్ని కాంబినేషన్లు అలాగే హీరోయిన్ ల లక్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయరు దర్శకనిర్మాతలు. ఎవరైనా హీరోయిన్ ఒక సినిమాతో వచ్చి హిట్ కొట్టగానే ఆమె వెంట పడుతూ ఉంటారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతానికి తెలుగులో బడా సినిమాల మేకర్స్ అందరూ పూజా హెగ్డే, రష్మిక మందన్నా లాంటి హీరోయిన్ […]
అప్పుడే 2021లో సగం అయిపోయింది. ఇవాళ్టితో ఆరు నెలలు పూర్తయ్యాయి. ఎన్నో ఆశలతో ఎంతో ఘనంగా దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున సినిమా రిలీజులతో కళకళలాడిన టాలీవుడ్ నాలుగు నెలలు తిరక్కుండానే కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ కుదేలైపోయింది. క్రాక్, మాస్టర్ వసూళ్లు జనవరిలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తే ఉప్పెన ఫిబ్రవరి మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని వసూళ్ల అలలతో పోటెత్తించింది. మార్చిలో జాతిరత్నాలు చిన్న చిత్రాల సత్తా చాటి ముప్పై కోట్లకు […]
థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు కానీ పరిశ్రమలో అంతర్గతంగా పెద్దల మధ్య జరుగుతున్న చర్చలను బట్టి జులై నుంచి విడుదలకు ప్లానింగ్ చేస్తునట్టు తెలిసింది. జనం హాళ్లకు వస్తారా రారా అనేది ఆలోచిస్తూ కూర్చుంటే ఈ ఏడాది మొత్తం ఇలాగే గడిచిపోతుందని అలా చేసే బదులు ధైర్యంగా ముందడుగు వేసి రిలీజులు ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా పరిస్థితులు అవే చక్కబడతాయనే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. ఒకవేళ ఆశించిన స్థాయిలో భారీ స్పందన […]
ఇప్పుడున్న ఈ లాక్ డౌన్ పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడప్పుడే అంతా సర్దుకునేటట్టు లేదు. లాక్ డౌన్ పూర్తయ్యాక అన్ని వ్యాపారాల మీద దీని ప్రభావం ఉంటుంది. అన్ని వ్యాపారాల గురించి చెప్పేకంటే నాకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న సినిమా మీద నా అవగాహన చెబుతా. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నది పక్కనపెడితే లాక్ డౌన్ ని ఎప్పుడు ఎత్తేసినా కూడా మళ్ళీ బిజినెస్ కుదుటపడటానికి ఆగస్ట్ సెప్టెంబర్ అవుతుంది. ఇంకా […]
అదేంటో కొన్ని కాకతాళీయంగా జరిగినా చాలా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అందులోనూ పరిశ్రమలో ఇలాంటి విచిత్రాలకు కొదవే లేదు. ఇప్పుడు మెగా మేనళ్ళులైన తేజ్ బ్రదర్స్ కు అలాంటి చిక్కే వచ్చి పడింది. సాయి ధరమ్ తేజ్ తెరంగేట్రం 2014లో పిల్లా నువ్వు లేని జీవితంతో జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2015లో రేయ్ రిలీజయింది. వాస్తవానికి ముందు రావాల్సింది రేయ్ నే. 2010లో షూటింగ్ ప్రారంభమైనా రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి […]
కోవిడ్ 19 సెగలు టాలీవుడ్ మీద అంతకంతా పెరిగిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా క్లిష్టంగా మారేలా ఉంది. ఇప్పటికే నాని ‘వి’ పోస్ట్ పోన్ కావడం పట్ల ట్రేడ్ ఆందోళన చెందుతుండగా మరోవైపు తెలంగాణలో థియేటర్ల బంద్ వాళ్లకు దినదిన గండంగా మారింది. ఇప్పుడు తాజాగా రానా వైపు నుంచి బాంబు పేలింది. చాలా గ్యాప్ తర్వాత రానా ఫుల్ లెన్త్ రోల్ చేసిన ‘అరణ్య’ వాయిదా పడింది. ముందు ప్రకటించిన […]
మార్చ్ లో ఒక్క నాని ‘వి’ తప్ప అంతా చప్పగా గడిచిపోతోందే అని ఫీలవుతున్న టాలీవుడ్ ప్రేమికుల కోసం ఏప్రిల్ లో ఫుల్ మీల్స్ రాబోతున్నాయి. క్రేజీ సినిమాలన్ని వరసగా రాబోతుండటంతో వేసవిలో కనువిందైన వినోదం పలకరించబోతోంది. ముందుగా ఏప్రిల్ 2నే తీసుకుంటే ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన ‘ఉప్పెన’, అనుష్క రెండేళ్ళ గ్యాప్ తర్వాత చేసిన ‘నిశబ్దం’, […]