iDreamPost
android-app
ios-app

నాని సరిపోదా శనివారంకు వెరైటీ సమస్యలు.. ఇలా కూడా జరుగుతుందా!

  • Published Jul 26, 2024 | 1:00 PMUpdated Jul 26, 2024 | 1:00 PM

Saripodhaa Sanivaaram: ప్రస్తుతం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అటు కొత్త సినిమాలు , ఇటు రీరిలీజ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ రీరిలీజ్ ల ఎఫెక్ట్ రాబోయే కొత్త సినిమాలపై ఏమన్నా పడనుందా అనే కొత్త అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో నాని సినిమాపై కొత్త ర్యూమర్స్ వినిపిస్తున్నాయి.

Saripodhaa Sanivaaram: ప్రస్తుతం ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అటు కొత్త సినిమాలు , ఇటు రీరిలీజ్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ రీరిలీజ్ ల ఎఫెక్ట్ రాబోయే కొత్త సినిమాలపై ఏమన్నా పడనుందా అనే కొత్త అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో నాని సినిమాపై కొత్త ర్యూమర్స్ వినిపిస్తున్నాయి.

  • Published Jul 26, 2024 | 1:00 PMUpdated Jul 26, 2024 | 1:00 PM
నాని సరిపోదా శనివారంకు వెరైటీ సమస్యలు.. ఇలా కూడా జరుగుతుందా!

ఆగష్టు నెల మూవీ లవర్స్ కు పండగే అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే కొత్త సినిమాలతో పాటు రీరిలీజ్ కు చాలానే ఉన్నాయి. ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ సినిమాలు, ఆగష్టు 29న నాని సరిపోదా శనివారం మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే నాని మూవీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆరోజు మిగిలిన ఏ సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి ఈజీగా.. నాని హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. అదేంటంటే.. ఆగష్టు లో కొత్త సినిమాలతో పాటు.. రీరిలీజ్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఈ రీరిలీజ్ ల ట్రెండ్ కొత్త సినిమాలపై పడనుందా.. అనే విషయాలు చూసేద్దాం.

ప్రస్తుతం థియేటర్స్ లో రీరిలీజ్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది. కొత్త సినిమాలకు వెళ్లని వారు కూడా రీరిలీజ్ కు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో కనీసం ఈ సినిమా ఒక్కసారైన రిలీజ్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ భావించిన సినిమా ఇంద్ర. ఆగష్టు 22 న ఇంద్ర మూవీ రీరిలీజ్ చేయనున్న సంగతి తెలియనిది కాదు. కనీసం ఈ ఎఫెక్ట్ వారం రోజులైనా ఉంటుంది. పోనీ ఆ సినిమా కాకపోయినా సరిగ్గా నాని మూవీ రిలీజ్ రోజే అంటే ఆగష్టు 29 న.. నాగార్జున మాస్ మూవీని రీరిలీజ్ చేయనున్నారు. ఒకవేళ ఆ సినిమాకు కనుక ఎక్కువ థియేటర్స్ ఇస్తే.. సరిపోదా శనివారం నష్టపోవాల్సిందే. ఇక వెంటనే సెప్టెంబర్ 2 న.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రిలీజ్ ఉంది. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ దీనిని ఎలా సెలెబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మూవీకి స్క్రీన్స్ బాగానే దక్కేలా ఉన్నాయి. ఇలా చూస్తుంటే సరిపోదా శనివారం అటు ఇటుగా కాస్త చిక్కుల్లోనే ఉందనిపిస్తుంది.

అయితే వేరే ఏ సినిమాలతో కంపారిజాన్ లేకుండా.. సరిపోదా శనివారం సినిమాకు ప్రస్తుతానికి డీసెంట్ హైప్ ఏ నడుస్తుంది. సినిమా పరంగా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ.. ఒకవేళ జనాలంతా రీరిలీజ్ కె ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం.. కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకు కాస్త ప్రభావం పడుతుంది. కానీ ఒక్కసారి ఫస్ట్ షో కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. కలెక్షన్స్ కూడా ఊపందుకుంటాయి. మరి రీరిలీజ్ ల ఎఫెక్ట్ ఈ మూవీపై పడుతుందా లేదా అనేది.. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీ పై అభిమానులకు మంచి హైప్ ఏ నడుస్తుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి