iDreamPost
android-app
ios-app

గేమ్ చేంజర్ నుంచి క్రేజీ అప్ డేట్ .. ‘నెల్లూరి నెరజాన’ ను తలపించే సాంగ్!

  • Published Jul 26, 2024 | 11:13 AMUpdated Jul 26, 2024 | 11:13 AM

Game Changer Song Update: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై.. భారీ అంచనాలే నెలకొన్నాయి . ఇప్పటికే ఈ సినిమా గురించి బజ్ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని పాటలకు సంబంధించి ఓ క్రేజి అప్ డేట్ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

Game Changer Song Update: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై.. భారీ అంచనాలే నెలకొన్నాయి . ఇప్పటికే ఈ సినిమా గురించి బజ్ మొదలైంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని పాటలకు సంబంధించి ఓ క్రేజి అప్ డేట్ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

  • Published Jul 26, 2024 | 11:13 AMUpdated Jul 26, 2024 | 11:13 AM
గేమ్ చేంజర్ నుంచి క్రేజీ  అప్ డేట్ ..  ‘నెల్లూరి నెరజాన’ ను తలపించే సాంగ్!

ప్రస్తుతం 2024 సెకండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోయే సినిమాలన్నీ కూడా బడా హీరోల భారీ బడ్జెట్ సినిమాలే. ఈ క్రమంలో ప్రస్తుతం అందరికి మిగిలిన సినిమాలతో పాటు.. రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిన్న మొన్నటి వరకు భారతీయుడు 2 ఎఫెక్ట్ ఎక్కడ ఈ సినిమా మీద పడుతుందా అని భయపడిన ప్రేక్షకులు . ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన క్రేజి అప్ డేట్ తో.. ఆ భయాలు వదిలేశారు. తాజాగా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఈ సినిమాలోని పాటలకు సంబంధించి ఇచ్చిన అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఆ క్రేజి అప్ డేట్ ఏంటో చూసేద్దాం.

మొన్న ఈ మధ్యనే దిల్ రాజు వలన .. గేమ్ చెంజర్ మూవీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది. అంటే ఇయర్ ఎండ్ లో చరణ్ బాక్స్ ఆఫీస్ పై కాసుల వర్షం కురిపిస్తాడని అభిమానులు హోప్స్ పెంచేసుకున్నారు. అలాగే మూవీలోని సాంగ్స్ విషయంలో తమన్ ఇచ్చిన అప్ డేట్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పేశారు. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సాంగ్ అప్ డేట్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. తాజాగా లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ ఈ సినిమాలోని పాటలకు సంబంధించి చెప్పిన మాటల్లో.. తానూ రాసిన పాత అద్భుతంగా వచ్చింది , తెరపై చూస్తే మీకే అర్ధమౌతుందని శంకర్ అన్నారట. దీనితో ఆయన రాసిన ఆ పాట.. మరో నెల్లూరి నెరజాన పాటలా ఉంటుందని తానూ భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

అసలే ఈ మూవీకి సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న క్రమంలో… ఇలాంటి ఓ క్రేజి అప్ డేట్ రావడంతో ఫ్యాన్స్ అంత ఖుషి అయిపోతున్నారు. ఇలాంటి ఓ క్లాసిక్ టచ్ ఉన్న సాంగ్ కానీ ఈ మూవీలో ఉంటే మాత్రం.. ఖచ్చితంగా ఆ సాంగ్ మరో ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. చూడబోతుంటే.. గేమ్ చేంజర్ విషయంలో శంకర్ ఎదో భారీగానే ప్లాన్ చేసినట్లు ఉన్నాడు. ఈ మూవీ నుంచి మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఆ అప్ డేట్స్ మూవీపై ఎలాంటి హైప్ ను క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి