iDreamPost
android-app
ios-app

తారక్, చరణ్, బన్నీ ముందు రేర్ రికార్డు! ముగ్గురిలో ఎవరికి సాధ్యం?

  • Published Jul 25, 2024 | 6:09 PMUpdated Jul 25, 2024 | 6:09 PM

Upcoming High Expected Movies In 2024: ఈ ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమా కల్కి.. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా ఈ 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే మూవీ ఏదా అని ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన అప్ డేట్స్ చూసేద్దాం.

Upcoming High Expected Movies In 2024: ఈ ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమా కల్కి.. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా ఈ 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే మూవీ ఏదా అని ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన అప్ డేట్స్ చూసేద్దాం.

  • Published Jul 25, 2024 | 6:09 PMUpdated Jul 25, 2024 | 6:09 PM
తారక్, చరణ్, బన్నీ ముందు రేర్ రికార్డు! ముగ్గురిలో ఎవరికి సాధ్యం?

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బ్రేక్ చేసే సినిమా ఏదా అనుకునే సమయానికి.. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి థియేటర్స్ లో అడుగుపెట్టింది. అప్పటివరకు ఉన్న ట్రెండింగ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసి.. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే.. ఈ మూవీతో ప్రభాస్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు రిలీజ్ అయినా కల్కి సినిమాతో మళ్ళీ ప్రభాస్ ఆ రేంజ్ కలెక్షన్స్ ను సాధించాడు. ఈ ఏడాది రిలీజ్ అయినా సినిమాలలో.. రూ.1000 కోట్ల సాధించిన సినిమా కల్కి. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా కూడా ఈ 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేసే నెక్స్ట్ మూవీ ఏదా అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ రేస్ లో ముగ్గురు బడా హీరోల చిత్రాలు ఉన్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

బాహుబలి సినిమాతో.. ప్రభాస్ పై రాజమౌళి ఎలాంటి అంచనాలు పెంచేశాడో.. ఆర్ఆర్ఆర్ మూవీతో.. తారక్ ,చరణ్ పై కూడా అలాంటి అంచనాలనే పెంచేశాడు జక్కన్న . ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను బద్దలకొట్టడంతో పాటు.. ఆ హీరోల తర్వాత సినిమాలపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ ఏడాది ఈ ఇద్దరు హీరోలు కూడా రేస్ లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ అసలు ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు కాబట్టి.. ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న “దేవర” సినిమాపై అందరికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న థియేటర్ లోకి రానుంది. ప్రేక్షకులంతా కూడా ఖచ్చితంగా దేవర ఈ 1000 కోట్ల మార్క్ ను క్రాస్ చేస్తాడని భావిస్తున్నారు.

ఇక ఆ తర్వాత.. సుకుమార్ , అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 మూవీ.. ఆల్రెడీ ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటికే ఉన్న హైప్ తో ఈ సినిమాను ముందుగా చెప్పిన డేట్ ప్రకారం రిలీజ్ చేసి ఉంటే మాత్రం అనుకున్నదానికంటే ఎక్కువ క్రేజ్ ఏ సంపాదించుకునేది కానీ.. కొన్ని కారణాల వలన ఈ సినిమాను డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఇక ఇదే డిసెంబర్ లో పుష్ప-2 పోటీగా చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకు భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ మూడు సినిమాలలో ఏ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి