iDreamPost
android-app
ios-app

Raj Tarun: హీరో రాజ్ తరుణ్ ట్యాగ్ ఏంటో తెలుసా !

  • Published Jul 26, 2024 | 12:27 PM Updated Updated Jul 26, 2024 | 12:27 PM

ఉయ్యాలా జంపాల మూవీ తో రాజ్ తరుణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ కు కొత్త ట్యాగ్ ను జత చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఉయ్యాలా జంపాల మూవీ తో రాజ్ తరుణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ కు కొత్త ట్యాగ్ ను జత చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 26, 2024 | 12:27 PMUpdated Jul 26, 2024 | 12:27 PM
Raj Tarun: హీరో రాజ్ తరుణ్  ట్యాగ్ ఏంటో తెలుసా !

రాజ్ తరుణ్ ఈ మధ్య కాలంలో మీడియా సోషల్ మీడియా లో ఈ పేరు బాగానే వినిపిస్తుంది. అతను పర్సనల్ విషయాలు పక్కన పెట్టేస్తే.. సినిమాల విషయంలో మాత్రం రాజ్ తరుణ్ కు డీసెంట్ హైప్ ఏ ఉంది. ఉయ్యాలా జంపాలా మూవీ తో రాజ్ తరుణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ఈ హీరో ప్రేక్షకులలో నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాడు. ఇక తాజాగా రాజ్ తరుణ్ నటించిన “పురుషోత్తముడు” మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ కు కొత్త ట్యాగ్ ను జత చేశారు. దానికి సంబంధించిన అప్ డేట్ చూసేద్దాం.

సాధారణంగా ఇండస్ట్రీ లో ఉండే హీరోస్ అందరికి తమ పేరుకు ముందు ఎదో ఒక ట్యాగ్ అనేది ఉంటూ ఉంటుంది. అది అందరికి తెలిసిన విషయమే కానీ కొంతమంది హీరోలకు మాత్రం ఇప్పుడిప్పుడే ఆ ట్యాగ్స్ ను యాడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ కు కూడా ఈ మూవీ నుంచి కొత్త ట్యాగ్ ను యాడ్ చేశారు. అదేంటంటే.. పురుషోత్తముడు టైటిల్స్ లో రాజ్ తరుణ్ కు “జోవియల్ స్టార్ రాజ్ తరుణ్” అని వేశారు. ఇక నుంచి అతని నెక్ట్ మూవీస్ లో కూడా ఈ ట్యాగ్ ఉండబోతుందని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచి రాజ్ తరుణ్ కూడా స్పెషల్ ట్యాగ్ ఉండబోతుంది. ఇక సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతానికైతే ఈ సినిమా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ నే సంపాదించుకుంటుంది. మరి లాంగ్ రన్ ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో వేచి చూడాలి.

Raj Tarun Tag

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి.. ఒక్కో సినిమాకు అప్ డేట్ అవుతూ తనదైన నటనను కనబరుస్తూనే ఉన్నాడు. ఉయ్యాలా జంపాల , కుమారి 21ఎఫ్ లాంటి మంచి హిట్స్ నే అందుకున్నాయి. ఆ తర్వాత కొంతకాలం మంచి సినిమాలు లేక.. రాజ్ తరుణ్ గ్రాఫ్ పడిపోయింది. మరి ఈ సారి పురుషోత్తముడు మూవీతో అయినా రాజ్ తరుణ్ కు హిట్ పడుతుందేమో చూడాలి. కాగా ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహించగా.. రాజ్ తరుణ్ కు జోడిగా హాసిని సుధీర్ జంటగా నటించింది. ఇక వీరితో పాటు ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ, మురళి శర్మ , బ్రహ్మానందం , ముకేశ్ ఖన్నా లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి. మరి రాజ్ తరుణ్ కు యాడ్ చేసిన కొత్త ట్యాగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş