iDreamPost
android-app
ios-app

OTT లవర్స్ కు పండగే.. BSNLలో కేవలం రూ.49తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్

  • Published Jul 26, 2024 | 10:00 PM Updated Updated Jul 26, 2024 | 10:00 PM

BSNL OTT Plan: ఓటీటీ లవర్స్ కు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 49కే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జీ5, సోని లివ్, డిస్నీ+హాట్ స్టార్, షెమరూ, హన్ గామా, లయన్స్ గేట్ ప్లే, ఎపిక్ ఆన్ వంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.

BSNL OTT Plan: ఓటీటీ లవర్స్ కు బీఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 49కే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జీ5, సోని లివ్, డిస్నీ+హాట్ స్టార్, షెమరూ, హన్ గామా, లయన్స్ గేట్ ప్లే, ఎపిక్ ఆన్ వంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.

  • Published Jul 26, 2024 | 10:00 PMUpdated Jul 26, 2024 | 10:00 PM
OTT లవర్స్ కు పండగే.. BSNLలో కేవలం రూ.49తో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్

సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ కు ప్రియారిటీ ఇచ్చేవారు చాలామంది ఉంటారు. తమ అభిమాన నటుల సినిమాలను చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. థియేటర్ లో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటని ఆరా తీస్తుంటారు మూవీ లవర్స్. ఇక ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి రావడంతో థియేటర్ కంటే ఇంట్లోనే సినిమాలు, సిరీస్ లుచూసి ఎంజాయ్ చేస్తున్నారు. తమకు నచ్చిన ఓటీటీల సబ్ స్క్రిప్షన్ తీసుకుని ప్రతీ వారం రిలీజ్ అయ్యే సినిమాలను చూస్తున్నారు. అయితే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను ఎయిర్ టెల్, జియో వంటి సంస్థలు రీఛార్జ్ ప్లాన్ తో పాటే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లవర్స్ కు బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ. 49కే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది.

ఇటీవల టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్ యూజర్లు బీఎస్ఎన్ఎల్ కు మారేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారిపోయారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను మరింత ఆకర్షించేందుకు అతి తక్కువ ధరతో రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నది. ఈ క్రమంలో సినిమా లవర్స్ కోసం తక్కువ ధరకే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తోంది. కేవలం రూ. 49కే పొందొచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో జీ5, సోని లివ్, డిస్నీ+హాట్ స్టార్, షెమరూ, హన్ గామా, లయన్స్ గేట్ ప్లే, ఎపిక్ ఆన్ వంటి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేకుండా కేవలం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అవసరమైన వారు తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఈ సేవ పేరు బీఎస్‌ఎన్‌ఎల్‌ సినిమా ప్లస్. ఓటీటీ ప్రియుల కోసం మరో ప్యాక్ అందుబాటులో ఉంది. రూ. 199తో సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ ను పొందొచ్చు. అదే విధంగా రూ. 249 ప్లాన్ తో కూడా సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు. బీఎస్ ఎన్ఎల్ అందించే ఈ ప్లాన్స్ తో మీకు నచ్చిన సినిమాలు, సిరీస్ లు ఎప్పుడంటే అప్పుడు చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet