గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో నమోదవుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. లాక్డౌన్ విధించబోమని పాలకులు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం ఆ దిశగానే సాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 8 వేలకు పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం లాక్డౌన్ దిశగా సాగుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో కూడా లాక్డౌన్ పెడతారన్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ రోజు హోం మంత్రి మహమూద్ ఆలీ కోవిడ్ కేసులపై పోలీసు ఉన్నతాధికారులపై సమీక్ష నిర్వహించారు. […]
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. మొదటి వేవ్ కన్నా ఈ సారే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రోజుకు లక్ష కేసులకుపైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ప్రకటన చేశారు. మరోసారి లాక్డౌన్ ఉంటుందన్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. మరోసారి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉండదని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ రోజు మోదీ కీలక ప్రకటన చేస్తారని రెండు రోజులుగా సాగుతున్న […]
రోడ్డు ప్రమాదం.. దీనికి అనేక కారణాలను చూపుతుంటారు. వాహనదారుడి అజాగ్రత్త, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, అతివేగం, నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం, వాహనం కండిషన్ సక్రమంగా లేకపోవడం, ఇంజనీరింగ్ లోపాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలు రోడ్డు ప్రమాదానికి ఆస్కారమిస్తున్నాయి. వీటి నివారణకు ప్రభుత్వాలు కోట్లలోనే ఖర్చు చేస్తుంటాయి. కానీ ఫలితం మాత్రం అంతంతమాత్రంగా ఉంటుందని చెప్పక తప్పదు. కోవిడ్ రోడ్డు ప్రమాదాలను మాత్రం గణనీయంగా తగ్గించదనే చెబుతారు. కోవిడ్ప్రభావంతో మనదేశంలో లాక్డౌన్ విధించారు. దీంతో […]
మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో అంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా ప్రజల్లో మాత్రమే కాదు, అధికారుల్లో కూడా మార్పు రావడం లేదు. కరోనా సోకిందేమో అన్న భయంతో సాటి మనిషికి సాయం చేయకపోవడం కారణంగా ఎందరో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఒక ఎత్తైతే కరోనా కారణంగా మరణించిన మృతదేహాల తరలింపులో కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. కొన్నిరోజుల క్రితం పశ్చిమబెంగాల్ లో కరోనాతో […]
ఒక్కరోజులో 18,552 పాజిటివ్ కేసులు – 384 మరణాలు కరోనా వైరస్ దేశంలో ఉగ్రరూపం దాలుస్తుంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 15 వేలకు పైగా కేసులు, 400 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 18,552 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,08,953 కి చేరింది. […]
బతికుంటే బలుసాకు తిని అయినా జీవించ వచ్చు కానీ.. ఆ మహమ్మారి బారిన పడకుండా ఉంటే చాలు అన్న ధోరణి అన్ని వర్గాల్లోనూ పెరుగుతోంది. స్వచ్చంధ లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి. బజార్లు మూత పడుతున్నాయి. ఆరంభం లో కంప్లీట్ లాక్ డౌన్ తో ప్రజలను కాపాడిన ప్రభుత్వాలు క్రమ క్రమంగా సడలింపులు ఇస్తూ వస్తున్నాయి. వ్యవస్థను ఎక్కువ కాలం స్తంభింప చేయడం సాధ్యం కాదు కాబట్టి అన్ లాక్ దిశగా అడుగులు వేస్తున్నాయి. త్వరలో […]
దేశంలో గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధర పెరిగుతున్నాయి. దీనిపై ఒకపక్క ప్రజలు, మరోపక్క ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో సంధిట్లో సడేమియా అన్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెంచేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువ ఉంది. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రతిపక్షాలు ఆందోళన చేద్దామన్నా లాక్ డౌన్ కారణంగా అందుకు అనుమతి లేదు. […]
వ్యాక్సిన్ వచ్చే వరకూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం, బయటకు వెళ్తే మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం తప్పనిసరి. సూది మందు వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే అని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వలస కూలీల కోసం రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్గార్ అభియాన్’ పథకాన్ని శుక్రవారం ఆయన ఉత్తర ప్రదేశ్ లో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా కట్టడికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటున్న […]
ఓ వైపు కరోనా కేసులు ఐదు లక్షలు దాటాక మరణాల సంఖ్య 15 వేలకు దగ్గరగా ఉన్నది. ఈ నేపథ్యంలో ”ఎవరు ఏమనుకున్నా మాకేంటీ మాకు బీహార్ గద్దెపైనే దృష్టి” అన్నట్టుగా మోడీ,అమిత్ షాలు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలకు మాత్రం త్వరలో బీహార్లో జరగబోయే ఎన్నికలవైపే దృష్టి పెట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను గద్దెదింపటానికి బిజెపి చేసిన ప్రయత్నాలు అన్నీ […]
హైదరాబాద్ లో అంతకంతా పెరుగుతూపోతున్న కరోనా కేసులతో పాటు టీవీ సీరియల్స్ షూటింగ్ లో యాక్టర్స్ దాని బారిన పడుతుండటంతో సినిమా తారలు హై అలెర్ట్ అయిపోయారు. వచ్చే నెల మొదటి వారం నుంచి సెట్ లో అడుగుపెడదాం అనుకున్న వాళ్లంతా దాదాపు డ్రాప్ అయ్యారని ఫిలిం నగర్ న్యూస్. ముఖ్యంగా స్టార్లు ససేమిరా అని చెబుతున్నట్టు టాక్. ఈ పరిస్థితి ఇంకో రెండు నెలలు కొనసాగేలా ఉంది కాబట్టి అప్పటిదాకా ఆశలు పెట్టుకున్నా లాభం లేదు. […]