iDreamPost

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు షాక్. నేడు బంగారం వెండి ధరలు పెరిగాయి. మరోసారి గోల్డ్ ధరల్లో పెరుగుదల కనిపించడంతో వినియోగదారులు బంగారం కొనేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

పసిడి ప్రియులకు షాక్. నేడు బంగారం వెండి ధరలు పెరిగాయి. మరోసారి గోల్డ్ ధరల్లో పెరుగుదల కనిపించడంతో వినియోగదారులు బంగారం కొనేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

ఇప్పుడు అంతా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. వేల సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. ఈ క్రమంలో బంగారం కొనే వారి సంఖ్య పెరుగుతోంది. గోల్డ్ ధరలు పెరిగినప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. సీజన్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. స్వల్పంగానే పెరిగినప్పటికీ పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో కస్టమర్లు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. నేడు హైదరాబాద్ మార్కెట్ లో గోల్డ్ ధర ఎంతుందంటే?

హైదరాబాద్ బులియన్ మార్కట్ లో 10గ్రాముల 22క్యారెట్లు గోల్డ్ ధర రూ.10 పెరిగింది. దీంతో నిన్న రూ.57100 ఉన్నటువంటి ధర నేడు రూ. 57,110కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర సైతం రూ. 10 పెరిగింది. దీంతో నిన్న రూ. 62290 ఉన్నటువంటి ధర నేడు రూ. 62300 వద్ద అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,260గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,450 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,610, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,850కి చేరుకుంది.

బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. నేడు సిల్వర్ ధరలు కూడా పెరిగాయి. ఈ రోజు కేజీ వెండిపై రూ. 100 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో నిన్న రూ.77000 వద్ద అమ్ముడవగా నేడు పెరిగిన ధరలతో రూ.77100కి చేరుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబయి, కోల్‌కతా, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 75,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి