iDreamPost

అదిరే ఫీచర్స్‌తో బెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్.. ధర 10 వేలే!

Best 5G Phone Under Budget: కస్టమర్ల మూడ్ ని బట్టి కంపెనీలు కూడా రకరకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అందులోనూ బడ్జెట్ లో ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో కంపెనీ తమ స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేసింది. అది కూడా బడ్జెట్ లో అందుబాటులోకి తీసుకురావడం విశేషం. మరి ఆ ఫోన్ ఏంటి? దాని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటి? దాని ధర ఎంత? అనే వివరాలు మీ కోసం.

కస్టమర్స్ అభిరుచికి తగ్గట్టు సరికొత్త స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కంపెనీలు మార్కెట్లో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. కొత్తగా ఏదైనా ఫోన్ వస్తుందంటే అది ఎలా ఉంటుందో అని.. దాన్ని అన్ బాక్స్ చేసేందుకు చాలా మంది ఆతురతగా ఎదురుచూస్తుంటారు. తాజాగా వివో బ్రాండ్ నుంచి సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. వివో బ్రాండ్ నుంచి వచ్చే ఫోన్స్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా వివో నుంచి వచ్చే టీ సిరీస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో టీ సిరీస్ ను విస్తరిస్తూ వివో  కంపెనీ భారత్ లో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. వివో టీ3 లైట్ 5జీ పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరకే అందుబాటులో ఉండడం మరో విశేషం. ఇక దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. 

స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుండగా.. మరొకటి 6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. అయితే ఈ ఫోన్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. వర్చువల్ ర్యామ్ సైజ్ ని అవసరాన్ని బట్టి ఒక వేరియంట్ లో 4 జీబీ వరకూ, మరొక వేరియంట్ లో 6 జీబీ వరకూ విస్తరించుకోవచ్చు. ఇక స్టోరేజ్ ని ఎస్డీ కార్డుతో 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇది 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో, 90 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 840 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ని మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో రూపొందించారు. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

ఇక వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఇది వైబ్రెంట్ గ్రీన్, మెజెస్టిక్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 4 జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ. 10,499 ఉండగా.. 6 జీబీ, 128 జీబీ వేరియంట్ ధర రూ. 11,499గా ఉంది. అదనంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి 500 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 4 నుంచి ఈ వివో టీ3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.      

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి