nagidream
Land Rates Reduced Near Kukatpally: హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డల్ అయ్యింది. ఈ కారణంగా చాలా ప్రాంతాల్లో స్థలాల ధరలు తగ్గాయి. అందులో కూకట్ పల్లి దగ్గరలో ఉన్న ఈ ఏరియా కూడా ఉంది. ఈ ఏరియాలో స్థలాల ధరలు తగ్గాయి. ఇప్పుడు కొనుక్కుంటే కనుక మంచి లాభాలను పొందవచ్చు.
Land Rates Reduced Near Kukatpally: హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డల్ అయ్యింది. ఈ కారణంగా చాలా ప్రాంతాల్లో స్థలాల ధరలు తగ్గాయి. అందులో కూకట్ పల్లి దగ్గరలో ఉన్న ఈ ఏరియా కూడా ఉంది. ఈ ఏరియాలో స్థలాల ధరలు తగ్గాయి. ఇప్పుడు కొనుక్కుంటే కనుక మంచి లాభాలను పొందవచ్చు.
nagidream
హైదరాబాద్ లో ప్రధాన ఏరియాలు సహా నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు, ఇళ్ల ధరలు తగ్గాయి. కొన్ని చోట్ల పెరిగాయి కూడా. అయితే భూముల ధరలు తగ్గినప్పుడు కొనుక్కుంటే చాలా డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఫ్యూచర్ లో లాభం కూడా ఉంటుంది. హైదరాబాద్ లో స్థలం కొనడం మీ కల అయితే తగ్గిన రేట్లతో మీరు ఆ కలను నిజం చేసుకోవచ్చు. కూకట్ పల్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియాలో ఇప్పుడు స్థలాల రేట్లు తగ్గాయి. ఇప్పుడు ఆ స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు 6 లక్షలు ఆదా అవ్వడమే గాక లాభం కూడా వస్తుంది.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్న మల్లంపేటలో స్థలాల రేట్లు తగ్గాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కారణంగా మల్లంపేట రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పెరిగింది. బాచుపల్లి నుంచి 2 కి.మీ., నిజాంపేట జంక్షన్ నుంచి 6 కి.మీ., కూకట్ పల్లి నుంచి 10 కి.మీ. దూరంలో ఉంది. బాచుపల్లిలో స్థలం కొనాలంటే చదరపు అడుగు యావరేజ్ గా రూ. 6,650 ఉంది. అదే నిజాంపేటలో అయితే రూ. 9,800, కూకట్ పల్లిలో అయితే రూ. 14,150గా ఉంది. ఈ ఏరియాల్లో కొనలేనివారు ఈ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఈ మల్లంపేటలో స్థలం కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ధరలు తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో మీరు ఏకంగా 6 లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. మల్లంపేట మాదాపూర్ నుంచి 17 కి.మీ., హైటెక్ సిటీకి 18 కి.మీ., అమీర్ పేట్ కి 20 కి.మీ. దూరంలో ఉంది. సిటీలో అన్ని ప్రధాన ఏరియాలకు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు.
2014లో మల్లంపేటలో చదరపు అడుగు స్థలం యావరేజ్ గా 600 రూపాయలు ఉండేది. నాలుగేళ్ల తర్వాత 2,300 అయ్యింది. మధ్యలో కొన్నిసార్లు రేట్లు తగ్గాయి. 2019 ఏడాది ప్రారంభంలో ఒక్కసారిగా 2,950కి పెరిగింది. ఆ తర్వాత 3300కి పెరిగింది. మళ్ళీ 2900కి పడిపోయింది. అలా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన మల్లంపేట స్థలాల ధరలు 2024 ఏడాది ప్రారంభానికి 6,650 రూపాయలకు పెరిగింది. 2023లో చదరపు అడుగు స్థలం రూ. 5,250 ఉండగా జనవరి నెలలో రూ. 6,650కి పెరిగింది. ప్రస్తుతం అయితే 6,150 రూపాయలకు పడిపోయింది. అంటే గజం దగ్గర మీకు 4,500 రూపాయలు ఆదా అవుతున్నట్టు. మీరు కనుక 2 బీహెచ్కేకి సరిపడా స్థలం కొన్నట్లైతే కనీసం 6 లక్షలైనా ఆదా చేసుకోగలుగుతారు. ఈ ఏరియాలో రేట్లు పెరిగితే కనుక మళ్ళీ ఎంత తగ్గిందో అంతే అమౌంట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు 6 లక్షల వరకూ ఆదా చేసుకోవచ్చు. 1200 చదరపు అడుగుల స్థలాన్ని మీరు 74 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. గతంలో ఈ ధర 80 లక్షలుగా ఉండేది.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.