iDreamPost

ఆ భారత స్టార్ నా కంటే 1000 రెట్లు బెటర్.. టీమ్​కు అలాంటోడే కావాలి: కపిల్ దేవ్

  • Published Jun 27, 2024 | 8:25 PMUpdated Jun 27, 2024 | 8:25 PM

Kapil Dev: టీ20 వరల్డ్ కప్​లో రెండో నాకౌట్ ఫైట్​కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్​తో తాడోపేడో తేల్చుకోనుంది భారత్. ఆ జట్టు​ అంతు చూడాలని అనుకుంటోంది రోహిత్ సేన. ఈ తరుణంలో మన టీమ్​లోని ఓ ఆటగాడి గురించి లెజెండ్ కపిల్​దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Kapil Dev: టీ20 వరల్డ్ కప్​లో రెండో నాకౌట్ ఫైట్​కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్​తో తాడోపేడో తేల్చుకోనుంది భారత్. ఆ జట్టు​ అంతు చూడాలని అనుకుంటోంది రోహిత్ సేన. ఈ తరుణంలో మన టీమ్​లోని ఓ ఆటగాడి గురించి లెజెండ్ కపిల్​దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Jun 27, 2024 | 8:25 PMUpdated Jun 27, 2024 | 8:25 PM
ఆ భారత స్టార్ నా కంటే 1000 రెట్లు బెటర్.. టీమ్​కు అలాంటోడే కావాలి: కపిల్ దేవ్

టీ20 వరల్డ్ కప్​లో నాకౌట్ ఫైట్​కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్​తో తాడోపేడో తేల్చుకోనుంది భారత్. ఆ జట్టు​ అంతు చూడాలని అనుకుంటోంది రోహిత్ సేన. టీ20 ప్రపంచ కప్-2022లో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని చూస్తోంది. ఆ ఏడాది సెమీస్ వరకు బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకొచ్చిన మెన్ ఇన్ బ్లూ.. ఇంగ్లండ్ దెబ్బకు ఫైనల్​కు చేరకుండానే వెనుదిరిగింది. అప్పటి నుంచి మరింత కసితో ఆడుతోంది భారత్. రోహిత్ సేన నాయకత్వంలో ఇండివిడ్యువల్ రికార్డులను పక్కనబెట్టి గెలుపే లక్ష్యంగా అటాకింగ్ అప్రోచ్​తో ముందుకెళ్తున్నారు. ఈసారి పొట్టి కప్పులోనూ అలాగే ఆడుతూ వరుస విజయాలు సాధించారు. నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్​తోనూ అలాగే ముందుకెళ్లాలని అనుకుంటున్నారు.

ఇంగ్లండ్​తో ఫైట్​కు అన్ని విధాలుగా ప్రిపేర్ అయింది టీమిండియా. అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్లు బట్లర్ సేనను ఓ పట్టు పట్టాలని డిసైడ్ అయ్యారు. బ్యాటింగ్​ యూనిట్​ను రోహిత్ లీడ్ చేయనుండగా.. బౌలింగ్ విభాగాన్ని నడిపే బాధ్యతల్ని పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా చూసుకోనున్నాడు. మెగాటోర్నీలో అద్భుతమైన బౌలింగ్​తో అదరగొడుతున్న బుమ్రా అదే స్థాయిలో చెలరేగితే ఇంగ్లీష్ టీమ్​కు చుక్కలే. ఈ తరుణంలో బుమ్రాపై భారత లెజెండ్, వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కంటే అతడు వెయ్యి రెట్లు మెరుగైన బౌలర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. డిఫరెంట్ వేరియేషన్స్​తో బౌలింగ్ చేస్తూ అపోజిషన్ టీమ్స్​పై బుమ్రా డామినేషన్ నడిపిస్తున్నాడని అభినందించాడు.

బుమ్రా ఓ అద్భుతమైన బౌలర్. అతడు నా కంటే 1000 రెట్లు మెరుగైన బౌలర్. మన జట్టులో ఉన్నవారిలో చాలా మంది టాలెంటెడ్ క్రికెటర్లే. వాళ్లకు మంచి ఎక్స్​పీరియెన్స్ ఉంది. ఫ్యూచర్​లో మరింత మెరుగవుతారు. ప్రస్తుత భారత ఆటగాళ్లు క్వాలిటీ క్రికెట్ ఆడటంతో పాటు ఫిట్​నెస్​ విషయంలోనూ చాలా బెటర్​గా ఉన్నారు. ఫిట్​గా ఉండేందుకు వాళ్లు తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. ఇదే ఆటతీరును ఇంకొన్నేళ్లు కొనసాగిస్తే తప్పకుండా గ్రేట్ క్రికెటర్స్​గా పేరు గడించడం ఖాయం’ అని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత తరంలో బౌలర్లలో బుమ్రా అందరికంటే డేంజరస్ అని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్​లో అతడి బౌలింగ్ చూస్తుంటే తనకు ముచ్చటేస్తోందని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. అతడి వేరియేషన్స్ అద్భుతమని.. అలాంటోడే టీమ్​కు కావాలని ప్రశంసించాడు. మరి.. బుమ్రా తన కంటే వెయ్యి రెట్లు బెటర్ అంటూ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి