iDreamPost

Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.వేలల్లో తగ్గుతున్న ధర..

  • Published Jun 27, 2024 | 9:08 AMUpdated Jun 27, 2024 | 9:08 AM

కొన్ని రోజులుగా పెరగడమే తప్ప దిగి రావడం తెలియదు అన్నట్లుగా ఉన్న బంగారం రేటు.. మూడు రోజులుగా దిగి వచ్చింది. అలానే నేడు కూడా తగ్గింది. ఆ వివరాలు..

కొన్ని రోజులుగా పెరగడమే తప్ప దిగి రావడం తెలియదు అన్నట్లుగా ఉన్న బంగారం రేటు.. మూడు రోజులుగా దిగి వచ్చింది. అలానే నేడు కూడా తగ్గింది. ఆ వివరాలు..

  • Published Jun 27, 2024 | 9:08 AMUpdated Jun 27, 2024 | 9:08 AM
Gold Rate: పసిడి ప్రియులకు భారీ ఊరట.. రూ.వేలల్లో తగ్గుతున్న ధర..

బంగారం పేరు వింటేనే చాలు మన వాళ్ల దేహాల్లో వైబ్రేషన్‌ మొదలవుతుంది. ఇక మన మహిళలకు అయితే వారి దగ్గర ఎంత బంగారం ఉన్నా ఆశ చాలదు. ఇంకో నగ ఉంటే బాగుండు అని భావిస్తారు. అందుకే సందర్భం దొరికిన ప్రతి సారి పసిడి కొనుగోలుకు అదిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో మన దేశంలో ధరతో సంబంధం లేకుండా పసిడి కోనుగోళ్లు భారీగా ఉంటాయి. అయితే గత కొన్ని నెలలుగా మన దగ్గర బంగారం, వెండి రేట్లు దూసుకుపోతున్నాయి. గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో సామాన్యులు బంగారం కొనాలంటే భయపడుతున్నారు. అయితే నేడు వారికి అదిరే శుభవార్త అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా పెరుగుతోన్న గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు.. నేడు భారీగా ఏకంగా వేల రూపాయల్లో దిగి వచ్చాయి. మరి నేడు భారతీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి అంటే..

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న బంగారం ధర నేడు మాత్రం శాంతించింది. గత మూడు రోజులుగా దిగి వస్తోన్న పుత్తడి ధర వరుసగా నాలుగో రోజు కూడా దిగి వచ్చింది. ఇక నేడు అనగా గురువారం నాడు భాగ్యనగరం బులియన్‌ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర నేడు భారీగా దిగి వచ్చింది. ఇవాళ 22 క్యారెట్‌ గోల్డ్‌ పది గ్రాముల ధర మరోసారి రూ.250 మేర తగ్గింది.

today gold rates

ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా చూసుకుంటే.. 22 క్యారెట్‌ బంగారం ధర 1150 రూపాయలు దిగి వచ్చింది. ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర రూ. 66 వేలకు పడిపోయింది. అలానే ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు కూడా తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.230 పడిపోయింది. ఇక నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర 72 వేల రూపాయలకు దిగి వచ్చింది.

ఇక దేశ రాజధాని హస్తినలో కూడా బంగారం ధర దిగి వస్తూనే ఉంది. నేడు ఢిల్లీలో 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర 230 రూపాయలు దిగి వచ్చి.. 72,150కి పడిపోయింది. అలానే 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల మీద రూ.250 తగ్గి.. 66,150 వద్ద అమ్ముడవుతోంది.

రూ.4 వేలు తగ్గిన సిల్వర్‌ రేటు..

ధర విషయంలో వెండి.. బంగారంతో పోటీ పడుతుంది. కొన్ని రోజుల క్రితం కేజీ సిల్వర్‌ రేటు లక్ష రూపాయలు చేరుకోగా.. నాలుగు రోజుల నుంచి మాత్రం దిగి వస్తోంది. ఇక నేడు ఒక్కరోజే వెండి ధర కిలో మీద ఏకంగా వేయ్యి రూపాయలు దిగి వచ్చింది.ఇక గత నాలుగు రోజులుగా చూసుకుంటే.. వెండి ధర కేజీ మీద ఏకంగా రూ. 4000 మేర తగ్గింది. ఇక నేడు హైదరాబాద్‌లో బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రేటు వెయ్యి రూపాయలు దిగి వచ్చి.. రూ. 94,400 స్థాయికి పడిపోయింది. అలానే ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే నేడు సిల్వర్‌ రేటు కిలో మీద రూ.1000 తగ్గి 90 వేల మార్క్‌కు చేరుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి