iDreamPost

త్వరలోనే తల్లికాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ! వెరైటీ పోస్ట్ వైరల్..

ఓ బిగ్ బాస్ బ్యూటీ త్వరలోనే తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త కాస్త వెరైటీగా చెప్పాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ జంట ఎవరంటే?

ఓ బిగ్ బాస్ బ్యూటీ త్వరలోనే తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త కాస్త వెరైటీగా చెప్పాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ జంట ఎవరంటే?

త్వరలోనే తల్లికాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ! వెరైటీ పోస్ట్ వైరల్..

సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉన్నారు సెలబ్రిటీలు. తమ ఇంట్లో జరిగే శుభకార్యాల దగ్గర నుంచి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నం అన్న విషయాలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ త్వరలోనే తల్లికాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త కాస్త వెరైటీగా చెప్పాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. మరి ఇంతకీ తల్లిదండ్రులు కాబోతున్న ఆ జంట ఎవరు? తెలుసుకుందాం పదండి.

బాలీవుడ్ జంట ప్రిన్స్ నరులా-యువికా చౌదరి త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో వీరిద్దరికి పరిచయం కాగా.. బిగ్ బాస్ హౌస్ లోనే యువికాకు ప్రపోజ్ చేశాడు ప్రిన్స్. అతడి కేరింగ్ కు ఫిదా అయిన ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో వీరిద్దరు 2018లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక అదే సంవత్సరం అక్టోబర్ లో పెళ్లితో ఒక్కటైయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా తన భార్య యువికా గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మా లైఫ్ లోకి ఓ కొత్త వెలుగు రాబోతోంది అంటూ పెద్ద జీప్ పక్కన చిన్న జీప్ పిక్ ను పెట్టి పోస్ట్ చేశాడు. నా భార్య నుంచి నేను అందుకునే ఉత్తమ బహుమతి ఇదే అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు సినీ ప్రముఖులు, నెటిజన్లు.

ఇక వీరి కెరీర్ విషయానికి వస్తే.. ప్రిన్స్ నరూలా పలు రియాలిటీ షోల్లో పాల్గొని విజేతగా నిలిచాడు. 2015లో వచ్చిన రోడీస్ 2 సీజన్ లో విజేతగా నిలిచాడు. అలాగే 2019లో నాచ్ బలియే డ్యాన్స్ షోలో జంటగా పాల్గొని విజయం సాధించాడు. హిందీ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని అందుకున్నాడు. ఇక యువికా చౌదరి.. ఓం శాంతి ఓం, నాటీ @40, ఎస్పీ చౌహాన్, ద పవర్, వీరేకి వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by PRINCE YUVIKA NARULA ❤️❤️❤️ (@princenarula)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి