iDreamPost

కల్కి సూపర్ హిట్.. ప్రభాస్‌పై ప్రేమ కురిపిస్తూ ఆ స్టార్ హీరోయిన్ పోస్ట్

Actress Anshu Congrats To Prabhas.. గ్లోబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ మూవీకి పాజిటివ్ రేటింగ్స్, రివ్యూస్ వస్తున్నాయి. కాగా, డార్లింగ్ సరసన నటించిన హీరోయిన్ కూడా విషెస్ తెలియజేసింది.

Actress Anshu Congrats To Prabhas.. గ్లోబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ మూవీకి పాజిటివ్ రేటింగ్స్, రివ్యూస్ వస్తున్నాయి. కాగా, డార్లింగ్ సరసన నటించిన హీరోయిన్ కూడా విషెస్ తెలియజేసింది.

కల్కి సూపర్ హిట్.. ప్రభాస్‌పై ప్రేమ కురిపిస్తూ ఆ స్టార్ హీరోయిన్ పోస్ట్

యంగ్ రెబల్ స్టార్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన మైథలాజికల్ మూవీ కల్కి2898 ఏడీ. ఇతిహాసగాధలకు సైన్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు. అత్యంత భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్‌తో మూవీ లవర్స్‌కు కనువిందు చేశాడు నాగీ. అమితాబ్, దీపికా, దిశా పటానీ, కమల్ హాసన్, శోభన, రాజేంద్ర ప్రసాద్ వంటి దిగ్గజ స్టార్స్ మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండ, అనుదీప్, ఫరియా, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, ఆర్జీవీ వంటి స్టార్స్ క్యామియో రోల్స్ చేశారు. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాకు తొలి షో నుండే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అభిమానులు సైతం ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని, కలెక్షన్లలో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.

అలాగే ప్రభాస్ మూవీ చూసి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. కల్కి2898 ఏడీపై డార్లింగ్ హీరోయిన్ కూడా స్పందించింది. సినిమాకు మంచి రేటింగ్, రివ్యూస్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపింది. ఆ హీరోయిన్ ఎవరంటే.. రాఘవేంద్రలో ప్రభాస్ సరసన ఆడిపాడిన అన్షు. కేవలం నాలుగంటే నాలుగు సినిమాలు చేసిన అన్షు అసలు పేరు అన్షు అంబానీ.‘అద్భుతమైన విజయం సాధించినందుకు నా రాఘవేంద్ర స్టార్ డార్లింగ్ ప్రభాస్.. కల్కి టీమ్‌కి అభినందనలు, నాగ్ అశ్విన్ మీ క్రియేటివిటీకి, కృషికి నాగ్ అశ్విన్ జోహార్లు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. మీరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

16 ఏళ్లకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అన్షు. మన్మధుడు చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మహిగా అందరి మనసులను దోచేసింది. కనిపించేది కాసేపు అయినా కట్టిపడేసింది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాఘవేంద్రలో నటించింది. అప్పట్లో అన్షు తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఈ రెండు చిత్రాల్లో ఆమె సెకండ్ హీరోయిన్‌గా పేరొచ్చింది. ఆ తర్వాత మిస్సమ్మలో గెస్ట్ రోల్ చేసింది. ఓ తమిళ చిత్రం చేశాక.. లండన్‌కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది. ఇటీవల ఇండియాకు వచ్చిన ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని అప్పటి విశేషాలు పంచుకుంది. అలాగే ఓ మూవీ ఆఫర్ కూడా కొల్లగొట్టింది. సందీప్ కిషన్ తదుపరి చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో అతడికి తల్లిగా నటించినట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి