iDreamPost

కల్కి అద్భుతం వెనుక 92 ఏళ్ళ.. ఓ మహా మేధావి ఆలోచన ఉందని తెలుసా? ఎవరాయన?

Mastermind Behind Kalki 2898 AD Movie Huge Success: కల్కి 2898 ఏడీ సినిమా గురించి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ వచ్చేసింది. అయితే ఈ సక్సెస్ వెనుక నాగ్ అశ్విన్ కృషి మాత్రమే కాకుండా.. ఒక మేధావి కూడా ఉన్నాడు.

Mastermind Behind Kalki 2898 AD Movie Huge Success: కల్కి 2898 ఏడీ సినిమా గురించి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ వచ్చేసింది. అయితే ఈ సక్సెస్ వెనుక నాగ్ అశ్విన్ కృషి మాత్రమే కాకుండా.. ఒక మేధావి కూడా ఉన్నాడు.

కల్కి అద్భుతం వెనుక 92 ఏళ్ళ.. ఓ మహా మేధావి ఆలోచన ఉందని తెలుసా? ఎవరాయన?

కల్కి 2898 ఏడీ.. ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ కు అందిన ఐ ఫీస్ట్ ఈ సినిమా. ఎక్కడ చూసినా ఇప్పుడు కల్కి సినిమా గురించే చర్చ జరుగుతోంది. నాగ్ అశ్విన్ విజన్ కు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. మైథాలజీని ఇలా సైంటిఫిక్ వేలో చూపించాలి అనే ఆ థాట్ కి ఫిదా అయిపోతున్నారు. కల్కి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు నాగ్ అశ్విన్ గురించి ఒకటే చెప్తున్నారు. వాటే థాట్.. వాటే విజన్.. పిచ్చోళ్లు అయిపోయం అని. అయితే ఈ క్రెడిట్ మొత్తం సోలోగా నాగ్ అశ్విన్ కి దక్కుతుంది. కానీ, కొంత క్రెడిట్ మాత్రం ఒక మేధావికి దక్కుతుంది. ఆ మేధావి ఎవరు? అసలు ఆయనకు ఎందుకు క్రెడిట్ ఇవ్వాలో చూద్దాం.

కల్కి సినిమా ఇవాళ థియేటర్లో విడుదల అయ్యింది అంటే ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలో జరిగింది కాదు. ఇది ఒక మహా యాగంలా కొన్నేళ్లపాటు క్రూ మొత్తం కలిసి ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి ప్రాణం కథ అనే చెప్పాలి. ఆ కథలో కూడా ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలు, మహా భారతం బ్యాగ్ డ్రాప్ అనేది ప్లస్ పాయింట్ అయ్యింది. ప్లస్ అనడం కాదు.. సోల్ అని చెప్పాలి. ఇలాంటి కథను నాగ్ అశ్విన్ రూపొందించడానికి చాలానే కష్ట పడ్డాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపి ఉండవచ్చు. అలాంటి క్రమంలో ఒక మేధావిని కూడా పలుసార్లు కలిశాడు. చాలా సూచనుల తీసుకున్నాడు. ఇప్పుడు ఈ క్రెడిట్ ఇస్తోంది కూడా ఆ 92 ఏళ్ల మేధావికే. ఆయన మరెవరో కాదు.. ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు.

KAlki success

నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ మూవీ ప్రాజెక్ట్ Kగా ఉన్న దశలో చాలాసార్లు సింగీతం శ్రీనివాసరావును కలిశారు అని వార్తలు వచ్చాయి. పలుమార్లు ఆయన్ను నాగ్ అశ్విన్ కలిశారు. అంతేకాకుండా ఈ కల్కి 2898 ఏడీ సినిమా కథ విషయంలో సింగీతం శ్రీనివాసరావు చాలానే ఇన్ పుట్స్ ఇచ్చారు అంటున్నారు. అయితే నాగ్ అశ్విన్ ఈ లెంజెండరీ డైరెక్టర్ నే ఎందుకు కలిసి ఉంటాడో మీరు ఆలోచించారా? ఆయన్నే ఎందుకు కలిశాడు అంటే.. ఆయన ఆలోచన సరళి అలా ఉంటుంది. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీకి.. అలాంటి ఫ్యూచరిస్టిక్ థాట్స్ ఉన్న వ్యక్తే కావాలి. సింగీతం శ్రీనివాసరావు ఆలోచన సరళ అంతా ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఆ విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది.

పుష్పక విమానం, ఆదిత్య 369, భైరవ ద్వీపం వంటి చిత్రాలను తెరకెక్కించిన లెంజెండరీ డైరెక్టర్ ఆయన. కల్కిలాంటి సైంటిఫిక్ మైథాలజీ సినిమాకి అలాంటి మేధావి ఇన్ పుట్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. అందుకే నాగ్ అశ్విన్ కూడా సింగీతం శ్రీనివాసరావు ఇన్ పుట్స్ తీసుకున్నాడు. ఇప్పుడు కల్కి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న తరుణంలో సింగీతం శ్రీనివాసరావుని తల్చుకోవడం కూడా మంచి సందర్భం అవుతుంది. ఆయన ఇన్ పుట్స్ సినిమాకి ఎంతగానో దోహదపడ్డాయి అనుకోవచ్చు. ఇంక కల్కి సినిమా విషయానికి వస్తే.. టాకు సంగతి పక్కన పెట్టేయండి. ఇంక ప్రభాస్- నాగ్ అశ్విన్ కలెక్షన్స్ వేట గురించి మాట్లాడుకోవాల్సిందే. మరి.. మీరు కల్కి సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి