iDreamPost

అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా..?

  • Published Jun 27, 2024 | 12:52 PMUpdated Jun 29, 2024 | 1:18 PM

మరి కొన్ని రోజుల్లో ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. కాగా, ప్రస్తుతం ఈ వివాహ వేడుకల్లో భాగంగా తాజాగా అనంత్ అంబానీకి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ధర అనేది సోషల్ మీడియాలో హాల్ చేస్తూ ఉంది. ఎందుకంటే.. ఈ వెడ్డింగ్ కార్డు ధర ఒక్కొక్కటి లక్షల రూపాయల్లో ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఒక వెడ్డింగ్ కార్డ్ ధర ఎంతంటే..

మరి కొన్ని రోజుల్లో ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. కాగా, ప్రస్తుతం ఈ వివాహ వేడుకల్లో భాగంగా తాజాగా అనంత్ అంబానీకి సంబంధించి వెడ్డింగ్ కార్డ్ ధర అనేది సోషల్ మీడియాలో హాల్ చేస్తూ ఉంది. ఎందుకంటే.. ఈ వెడ్డింగ్ కార్డు ధర ఒక్కొక్కటి లక్షల రూపాయల్లో ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి ఒక వెడ్డింగ్ కార్డ్ ధర ఎంతంటే..

  • Published Jun 27, 2024 | 12:52 PMUpdated Jun 29, 2024 | 1:18 PM
అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా..?

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ఇంట మరి కొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కాగా, వీరి కూమారుడు అయిన అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ లకు వివాహం జరగనుంది.ఇకపోతే గత రెండు నెలల క్రితం అనగా మార్చి 1వతేదీన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను మూడు రోజుల పాటు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వేడుకలకు పెద్ద ఎత్తునే సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు విదేశాల నుంచి కూడా అతిరథ మహరథులు హాజరయ్యారు. అలాగే రెండోవసారి కూడా వీరి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం అనేది ముంబైలో జరిగిపోయింది. ఇక అంబానీ ఇంట పెళ్లి సందడి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అందుకు తగ్గట్టుగానే వీరి వివాహ వేడకకు సంబంధించి ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్యనే అనంత్ అంబానీ, రాధికా మార్చంట్ ల వెడ్డింగ్ కార్డ్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డ్ ధర అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోతారు

ప్రస్తుతం అనంత్ అంబానీకి వెడ్డింగ్ కార్డ్ ధర అనేది సోషల్ మీడియాలో హాల్ చేస్తూ ఉంది. ఎందుకంటే.. ఈ వెడ్డింగ్ కార్డు ధర ఒక్కొక్కటి లక్షల రూపాయల్లో ఉంటుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదేంటి ఒక్క వెడ్డింగ్ కార్డు ధర లక్షల్లో ఉంటుదా అంటే.. అవును అని ఆశ్చర్యపోక తప్పదు. ఎంతైనా అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ మాత్రం ఉంటుందని అనుకోకమానరు. ఇంతకి ఒక్క వెడ్డింగ్ కార్డ్ ధర ఎంతంటే.. అక్షరాలా రూ. 6.50 లక్షలు. అదేంటి.. రూ.6 లక్షలా అని అవాక్కయిపోతున్నరా.. ఎందుకంటే ఈ కార్డును మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు ఇది. ప్రస్తుతం ఈ కార్డు ధర అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ కార్డు ధర తెలిసినవారు అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనట్టుగా అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకంటే.. గతంలో కూడా అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహ పత్రిక ధర కూడా మూడు లక్షలు కావడం గమన్హారం. అయితే ఇప్పుడు కొడుకు పెళ్లి కాబట్టి, ప్రతి విషయంలో అత్యంత ఖరీదైన వివాహంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం సాయంత్రం కొంతమంది ముఖ్యమంత్రులకు, ఇతర వీవీఐపీలకు ఇచ్చిన ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వెడ్డింగ్ కార్డు వివరాలు తెలిసిన పలువురు ఆ కార్డు విలువతో సామాన్యుల ఇంటిలో పెళ్లి చేసేకోవచ్చు అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు వివరాల ప్రకారం.. ముందుగా ఆ కార్డులో వెండితో చేసిన చిన్న గుడి లాంటి పెట్టె ఉండగా.. దాని తెరవగానే బ్యాక్ గ్రౌండ్ లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. ఇక ట్టె లోపల 24 క్యారెట్‌ల బంగారు విగ్రహాలు కూడా ఉండడం అందరినీ ఆకర్షించింది.

అలాగే వెండి కార్డు బ్యాక్ గ్రౌండ్‌లో మంత్రాలు ప్లే చేయబడిన పురాతన దేవాలయం ప్రధాన ద్వారంలా కనిపిస్తుంది. అయితే కార్డులో మొదట గణేష్, విష్ణువు, లక్ష్మీదేవి, రాధా-కృష్ణ, దుర్గాదేవి వంటి అనేక హిందూ దేవతల బంగారు చిత్రాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆలయం  గేటు తెరిచినప్పుడు, ఎవరైనా ఆలయ స్టాండ్ బయటకు తీయవచ్చు. దీంతో పాటు అంబానీల వివాహ ఆహ్వాన పత్రికలో మరొక వెండి పెట్టె ఉంటుంది. దాని ముందు భాగంలో విష్ణువు బొమ్మ ఉంది. పెట్టెను తెరిచినప్పుడు, దానిలో ఓం అని ఎంబ్రాయిడ్ చేయబడిన ఒక శాలువ, నెట్ హాంకీ ఉన్నాయి. ఆ పెట్టెలో బంగారంతో అలంకరించబడిన వివిధ హిందూ విగ్రహాలు కూడా ఉన్నాయి.ఇకపోతే అనంత్ అంబానీ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలో జరగనుంది. మరి, ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మార్చెంట్ ల వెడ్డింగ్ కార్డు, ధర వైరల్ అవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి