iDreamPost
android-app
ios-app

స్మోకింగ్ ఎక్కువ చేస్తే… గొంతులో వెంట్రుకలు వస్తాయా? అసలు నిజం ఇది!

నేటికాలంలో స్మోకింగ్ చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎక్కువగా సిగెరట్లు తాగే వారి విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువ స్మోకింగ్ చేయడంతో ఓ వ్యక్తికి గొంతులు వెంట్రుకలు వచ్చాయి.

నేటికాలంలో స్మోకింగ్ చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎక్కువగా సిగెరట్లు తాగే వారి విషయంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువ స్మోకింగ్ చేయడంతో ఓ వ్యక్తికి గొంతులు వెంట్రుకలు వచ్చాయి.

స్మోకింగ్ ఎక్కువ చేస్తే… గొంతులో వెంట్రుకలు వస్తాయా? అసలు నిజం ఇది!

ప్రస్తుతం కాలంలో జట్టురాలిపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. ముఖ్యంగా యువకుల్లో చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. దీంతో వారు చాలా ఆందోళనకు గురవతున్నారు. ఇలా నెత్తి మీద జుట్టు రాలిపోతున్న నేటి కాలంలో గొంతులో వెంట్రుకలు మొలుస్తున్నాయంట. అది ఓ వ్యక్తికీ ఎదురైన అనుభవమంట. ఈ క్రమంలోనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సిగరెట్ కు, జుట్టుకు లింక్ ఉందా?, స్మోకింగ్ ఎక్కువ చేస్తే.. గొంతులో వెంట్రుకలు వస్తాయా?. ఇవ్వన్నీ సదరు వ్యక్తికి ఎదురైన అనుభవం. మరి.. అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రియాకు చెందిన 52 ఏళ్ల చైన్ స్మోకర్‌..  రోజూ ఒక ప్యాకెట్ సిగరెట్ తాగేవాడంట. ఆయన జీవితంలో సుమారు దాదాపు మూడు దశాబ్దాల పాటు సిగరెట్లను తాగాడట. 1990లో వ్యక్తికి  20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు సిగరెట్ తాగడం ప్రారంభించాడు. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు స్మాకింగ్ చేస్తూనే ఉన్నాడు. దీంతో అతని గొంతులో 9 వెంట్రుకలు మొలిచినట్లు గుర్తించాడు. 2007లో ఏదో గొంతు సమస్యగా ఉందని వైద్యుడి వద్దకు వెళ్లగా ఈ విషయం బయటపడింది. వీటిని శ్వాశ్వతంగా తొలగిస్తామని, అయితే శాశ్వతంగా స్మోకింగ్ మానేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అందుకు అతడు ఒప్పుకోలేదు. 15 ఏళ్లుగా  వాటిని తాత్కాలికంగా తీయించుకుంటూ  వచ్చాడు. అలా తాత్కాలికంగా తీయించుకునే క్రమంలో దాదాపు 15 ఏళ్ల పాటు నరకం అనుభవించాడు.

చివరకు ఆ నరకం భరించలేక.. సిగరెట్లు తాగడం మానేసి ఆపరేషన్ చేయించుకున్నాడు. శస్త్ర చికిత్స విజయవంతమైందని, గొంతులో ఇక వెంట్రుకలు రావని వైద్యులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ వ్యక్తి విషయంలో వైద్యులు కీలక విషయాలను తెలిపారు. ఆ వ్యక్తి గొంతులో వెంట్రుకలు రావడానవికి కారణం స్మోకింగ్ ఎక్కువగా చేయడమేనని డాక్టర్లు తేల్చారు. అయితే అతనికి పుట్టుకతోనే గొంతులో 2 ఇంచుల సైజులో 9 వెంట్రుకలు వుండేవి అంట. సిగరెట్  ఎక్కువగా తాగడం వల్ల ఆ వెంట్రుకలు మరింత పెరిగాయ‌ని తేల్చారు డాక్టర్లు. అంతేకాని సిగరెట్ తాగితే వెంట్రుకలు మొలుస్తాయని వైద్యులు ఎక్కడా నిర్ధారణ చేయలేదు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.